పెద్ది మెగా సక్సెస్ ఈవెంట్
- June 24, 2026
హైదరాబాద్: రామ్ చరణ్ పెద్ది సినిమాతో వచ్చి పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దాదాపు 420 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇన్ స్పైరింగ్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో చరణ్ పర్ఫార్మెన్స్ ని అందరూ పొగిడారు. పెద్ది సినిమా భారీ విజయం సాధించినందుకు నేడు హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాలు రావాలి. పరిశ్రమ సుభిక్షంగా ఉండాలి. ఈ సినిమా చూసినప్పుడు ఒక రకమైన భావోద్వేగాన్ని పొందాను. అలా తక్కువ సినిమాలకు కలుగుతుంది. నేను సినిమాలో లీనమయ్యాను. ఇది పవర్ ఫుల్, ఎమోషనల్, మోటివేషనల్, ఇంటెన్స్ సబ్జెక్టు. ఇలాంటి కథని చరణ్ దగ్గరకు తీసుకొచ్చినందుకు బుచ్చిబాబుకు ధన్యవాదాలు. బుచ్చిబాబు లాంటి దర్శకులను సాన పెట్టి బయటకు తీసిన సుకుమార్ ని అభినందించాలి. చరణ్ ని ఒక తోటి నటుడిగా అభినందిస్తున్నా. తండ్రిగా గర్వపడుతున్నా. రంగస్థలం సినిమాకు చరణ్ ని గొప్పగా చేసాడని అభినందించారు. అలాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తాయి. తక్కువ గ్యాప్ లోనే మళ్ళీ పెద్ది వచ్చింది. ఇలాంటి పాత్ర రావడం చరణ్ అదృష్టవంతుడు. ఆర్టిస్టులు ఎమోషన్ ని ఫీల్ అవ్వాలి కానీ ఫేస్ లో చూపించి రక్తి కట్టించాలి అనుకోకూడదు. తను ఎమోషన్ ని కళ్ళతో చూపించాడు తను ఫీల్ అయి నటించాడు.
స్టార్ కొడుకు గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు చరణ్ కి అవసర్లేదు ఇంత కష్టం, డైరెక్టర్ చెప్పింది చేస్తే చాలు కానీ చరణ్ వన్ మ్యాన్ షో అయ్యేలా కష్టపడ్డాడు. మీ అందరూ నేషనల్ అవార్డు వస్తుంది అన్నారు. రంగస్థలంకి నేషనల్ అవార్డు వస్తుంది అని సుకుమార్ కూడా అన్నాడు. అది రానివ్వు రానివ్వకపోనివ్వు కానీ ఇది అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని ప్రజలు అన్నారు. దానికి మించిన అవార్డు లేదు. అవార్డు రావడానికి చాలా దార్లు ఉంటాయి కానీ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని ప్రేక్షకులు అంటుంటే అదే గొప్ప అవార్డు.
ఈ సినిమాకు చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఎంత కష్టపడ్డాడో. ఎక్సర్ సైజ్ చేసాడో నేను కళ్లారా చూసి అవసరమా అని అన్నాను. కానీ సినిమా గురించి చెప్పాడు. వాళ్ళ అమ్మ బాధపడింది కానీ నేను శభాష్ కష్టాన్ని నమ్ముకున్నాడు అని అభినందించాను. చరణ్ కి కంటికి దెబ్బ తగిలింది, హాస్పిటల్ కి తీసుకెళ్ళాం అని ఫోన్ కాల్ వచ్చి ఆ కన్ను ఫోటో పెట్టారు. ఆ కన్ను అంతా ఎర్రగా అయిపోవడంతో భయపడ్డాను కన్ను పోతుందేమో అని. వాళ్ళ అమ్మకు కూడా చెప్పలేదు. డాక్టర్ తో మాట్లాడాను. కన్ను గుడ్డు పోవాల్సింది జస్ట్ మిస్ లో బోన్ దగ్గర తగిలింది కుట్లు వేసాను అని చెప్తే రిలీఫ్ అయ్యాను. అంత కష్టం చూసి బాధపడే కంటే కూడా సంతోష పడ్డాను. అప్పట్లో నా కష్టం చూసి మా నాన్న కూడా నన్ను తిట్టేవాడు ఎందుకు అదంతా అని ఇప్పుడు ఒక తండ్రిగా నాకు అనిపిస్తుంది. కంటికి దెబ్బ, మణికట్టు గాయం.. ఇవ్వని చెప్తుంటే మా నాన్నే గుర్తొచ్చారు. ఇవాళ నా కొడుకు కష్టానికి ప్రతీక. అడ్డదారిలో ఏది రాదు అని కష్టపడ్డాడు, మీ అందరితో పెద్ది అనిపించుకున్నాడు.
మేము కష్టాన్ని నమ్ముకున్నాం. ఏది షార్ట్ కట్ లో రావాలని కోరుకోము. నేను, చరణ్ జిమ్ లో పోటీ పడతాము అప్పుడప్పుడు. చరణ్ నటించలేదు ఈ సినిమాలో జీవించాడు. ఇక చిరంజీవి కాదు చరణ్ జీవి అని మీరు అంటుంటే ఆనందంగా ఉంది. నిన్న చరణ్ ఢిల్లీలో ఒక సమ్మిట్ లో పాల్గొంటే అక్కడ చరణ్ ని న్యూ ఏజ్ మెగాస్టార్ అన్నారు. అందుకే నేను వెనక ఉండి చరణ్ ముందు ఉండాలి అని అనుకోవడం కరెక్ట్. రంగస్థలం తర్వాత కొంతవరకు పెద్ది తర్వాత మొత్తం పుత్రోత్సాహం నేను ఫీల్ అవుతున్నాను. బిడ్డ ఎదిగాడు మీరు ఇంకా సినిమాలు చేయాలా అని అడిగారు. నేను చేయాలి, చేస్తాను. పని చేయడంలో ఆనందం ఉంటుంది. ఇప్పటికి ఉదయమే లేచి షూట్ కి వెళ్తున్నాను. అందరికి పని జీవనోపాధి. సోమరితనం ఉండకూడదు అందరికి. మా కష్టానికి ప్రతిఫలంగా మమ్మల్ని ఎక్కడో మీ గుండెల్లో పెట్టారు. చరణ్ తరపున మా కుటుంబం తరపున అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ అయ్యారు. అనంతరం మూవీ యూనిట్ ని అభినందించారు చిరంజీవి.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్‌లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







