ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!

- June 24, 2026 , by Maagulf
ICRF \'థర్స్ట్ క్వెంచర్స్ 2026\' క్యాంపెయిన్ ప్రారంభం..!!

మనామా: బహ్రెయిన్ లోని ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ (ICRF బహ్రెయిన్) సమ్మర్ లో ఓపెన్ ఏరియాల్లో పనిచేసే కార్మికులలో ఆరోగ్యం మరియు భద్రతను ప్రోత్సహించే లక్ష్యంతో "థర్స్ట్ క్వెంచర్స్ 2026" పేరిట తన వార్షిక సమ్మర్ అవేర్నెస్ క్యాంపెయిన్ ను ప్రారంభించింది.

బహ్రెయిన్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన సమ్మర్ భద్రతా చర్యలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ క్యాంపెయిన్ కు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) మరియు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) మద్దతునిస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు నీరు, జ్యూస్, ఆరెంజులు, ఆపిల్, అరటిపండ్లు వంటి తాజా పండ్లను పంపిణీ చేస్తున్నారు.  జూన్ 20న జల్లాక్‌లోని సెబార్కో వర్క్ సైట్ లో అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుమారు 500 మంది కార్మికులు పాల్గొన్నారు. ఈ వేడుకలో ఐసీఆర్ఎఫ్ ప్రధాన కార్యదర్శి అనీష్ శ్రీధరన్, కార్మిక మంత్రిత్వ శాఖ, ఎల్ఎమ్ఆర్ఏ, సెబార్కో నుండి అధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సమ్మర్ లో కార్మికుల సంక్షేమానికి సురక్షితమైన పని వాతావరణాన్ని అందించడానికి ప్రభుత్వ సంస్థలు చేస్తున్న నిరంతర ప్రయత్నాలను ఐసీఆర్ఎఫ్ ఛైర్మన్ అడ్వకేట్ వి. కె. థామస్ ప్రశంసించారు.  

2016లో ప్రారంభమైన “థర్స్ట్ క్వెంచర్స్” క్యాంపెయిన్ ఇప్పుడు విజయవంతంగా 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రత్యేక శిక్షణ పొందిన వాలంటీర్లు బహ్రెయిన్ వ్యాప్తంగా పలు వర్క్ సైట్లను వారానికోసారి సందర్శించి, వారికి అవగాహన కల్పిస్తారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com