హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..
- June 24, 2026
భాగ్యనగర వాసులకు పర్యావరణహితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే దిశగా టీజీఆర్టీసీ తెలంగాణ గ్రేటర్ ఆర్టీసీ) మరో కీలక అడుగు వేసింది. కాలుష్య రహిత నగరమే లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి కొత్తగా మరో 37 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు (E-Buses) వచ్చి చేరాయి. ఇటీవల కూకట్పల్లి డిపో పరిధిలో ప్రారంభించిన 23 ఈ-బస్సులకు ప్రయాణికుల నుంచి అద్భుతమైన ఆదరణ లభించడంతో, ఈ గ్రీన్ నెట్‌వర్క్‌ను నగరం నలువైపులా విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. అయితే, కొత్త బస్సులు డిపోలకు చేరుకున్నప్పటికీ.. అవి ప్రయాణికులకు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. బస్సులను నడపడానికి అవసరమైన అర్హత కలిగిన డ్రైవర్ల కొరత (Drivers Scarcity) ఉండటమే ఈ జాప్యానికి ప్రధాన కారణం. ప్రయాణికుల భద్రత దృష్ట్యా డ్రైవర్ల ఎంపికలో కఠినమైన మెడికల్ టెస్టులు, డ్రైవింగ్ సామర్థ్య పరీక్షలు, ప్రత్యేక ట్రయల్ రన్ పూర్తి చేసిన తర్వాతే ఈ వాహనాలను రోడ్డెక్కించనున్నారు.
కొత్తగా పరుగులు పెట్టే 5 ప్రధాన రూట్లు ఇవే
నగరంలో అత్యధిక ప్రయాణికుల రద్దీ ఉండే 5 కీలక మార్గాలను ఎంపిక చేసి, ఈ కొత్త 37 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించేందుకు ఆర్టీసీ అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు:
- రూట్ 1 (19S/505): సనత్‌నగర్ నుంచి శంకర్పల్లి బస్ స్టేషన్
- రూట్ 2 (19M/P): మెహిదీపట్నం నుంచి ప్రగతినగర్
- రూట్ 3 (10 K/J): జగద్గిరిగుట్ట నుంచి సికింద్రాబాద్
- రూట్ 4 (10KM): సికింద్రాబాద్ నుంచి మియాపూర్ క్రాస్‌రోడ్
- రూట్ 5 (219): పటాన్చెరు బస్టాండ్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్
ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ-బస్సుల వివరాలు
పాతబస్తీ వాసులతో పాటు ఐటీ కారిడార్, ప్రధాన కనెక్టివిటీ రూట్లలో ఆర్టీసీ ఇప్పటికే పలు మార్గాల్లో ఈ-బస్సులను విజయవంతంగా నడుపుతోంది.
స్తుతం నడుస్తున్న ప్రముఖ మార్గాలు
- బోరబండ ⇄ చార్మినార్
- బోరబండ ⇄ చార్మినార్ (వయా యూసుఫ్‌గూడ)
- సికింద్రాబాద్ ⇄ పర్వత్‌నగర్
- మెహిదీపట్నం ⇄ బోరబండ
- మెహిదీపట్నం ⇄ బోరబండ (వయా యూసుఫ్‌గూడ)
కొత్తగా రానున్న 37 బస్సులు కూడా తోడైతే నగరంలో కార్బన్ ఉద్గారాలు తగ్గి, కాలుష్య నివారణకు మరింత తోడ్పాటు లభిస్తుందని గ్రేటర్ ఆర్టీసీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







