సిరంజీలు, వైల్స్ తరహా ప్యాకేజింగ్‌లో కాస్మెటిక్స్.. సౌదీలో నిషేధం..!!
- August 11, 2026
రియాద్: ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులను పోలిన ప్యాకేజింగ్‌లో విక్రయించే కొన్ని కాస్మెటిక్ ఉత్పత్తులపై సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. యాంప్యూల్స్, వైల్స్, సిరంజీల తరహాలో ప్యాక్ చేసి విక్రయించే బాహ్య వినియోగ కాస్మెటిక్ ఉత్పత్తులను నిషేధిస్తున్నట్లు సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) ప్రకటించింది. ఈ నిషేధం 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. కాస్మెటిక్ ఉత్పత్తుల తయారీదారులు, దిగుమతిదారులకు SFDA ఇటీవల జారీ చేసిన సర్క్యులర్‌లో ఈ నిబంధనలను వెల్లడించింది.
ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల తరహాలో కనిపించే ప్యాకేజింగ్‌లో కొన్ని కాస్మెటిక్ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నట్లు గుర్తించిన SFDA.. వినియోగదారుల్లో గందరగోళం తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. సిరంజీ రూపంలో ప్యాక్ చేసిన కాస్మెటిక్ ఉత్పత్తులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది.
యాంప్యూల్స్, వైల్స్పై హెచ్చరికలు తప్పనిసరి
యాంప్యూల్స్, వైల్స్ రూపంలో మార్కెట్ చేసే కాస్మెటిక్ ఉత్పత్తుల లోపలి, బయటి ప్యాకేజింగ్‌పై అరబిక్, ఇంగ్లిష్ భాషల్లో స్పష్టంగా కొన్ని హెచ్చరికలను ముద్రించాలి. ఈ ఉత్పత్తులను ఇంజెక్షన్ ద్వారా లేదా చర్మంలోకి చొచ్చుకుపోయే ఇతర పరికరాల ద్వారా ఉపయోగించవచ్చనే అర్థం వచ్చేలా ప్రకటనలు, ప్రచారం లేదా మార్కెటింగ్ చేయడాన్ని కూడా నిషేధించారు. కాస్మెటిక్ ఉత్పత్తుల వినియోగంపై వినియోగదారుల్లో ఎలాంటి అపోహలు ఏర్పడకుండా ఈ నిబంధనలను తీసుకొచ్చినట్లు SFDA పేర్కొంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈ తరహా ఉత్పత్తులను 2026 డిసెంబర్ 31లోగా వెనక్కి తీసుకోవాలని తయారీదారులు, దిగుమతిదారులకు గడువు ఇచ్చారు. ఈ వ్యవధిలో ఉత్పత్తులను మార్కెట్ నుంచి రీకాల్ చేయడంతో పాటు, అవసరమైన చోట నిబంధనలకు అనుగుణంగా ప్యాకేజింగ్, లేబులింగ్, ఇతర అంశాలను సరిచేసుకోవాలని SFDA ఆదేశించింది.
చట్టపరమైన చర్యలు
2026 డిసెంబర్ 31 గడువు ముగిసిన తర్వాత కూడా ఈ నిబంధనలను పాటించని ఉత్పత్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ హెచ్చరించింది. వినియోగదారుల భద్రతను కాపాడటం, కాస్మెటిక్ ఉత్పత్తులు-మెడిసిన్స్ మధ్య గందరగోళాన్ని నివారించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







