ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- June 24, 2026
మనామా: ఇండియన్ లేడీస్ అసోసియేషన్ (ILA) తన 70వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఫోటోగ్రాఫర్లు తమ కెమెరా ద్వారా బహ్రెయిన్ సౌందర్యాన్ని, సంస్కృతిని చక్కగా ఆవిష్కరించారు.
ఈ పోటీలో150 మంది మహిళా ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. బహ్రెయిన్ పై తమ ప్రత్యేక దృక్కోణాలను తెలియజేసేలా 200కు పైగా ఫోటోలను సమర్పించారు. ILA క్లబ్‌హౌస్‌లో జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో విజేతలను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహ్రెయిన్ చిత్రనిర్మాత బస్సామ్ అల్ థవాడి హాజరయ్యారు.
కావ్య సరీన్ మొదటి స్థానంలో నిలిచారు. 500 డాలర్ల నగదు బహుమతితో పాటు ఒక కానన్ వ్లాగింగ్ కెమెరాను అందుకున్నారు. నజీబా టి రెండవ స్థానంలో నిలిచి 300 డాలర్ల బహుమతితో పాటు ఒక కానన్ ఫోటో ప్రింటర్‌ను పొందారు. మనహిల్ సోహైల్ మూడవ స్థానం పొంది 200 డాలర్ల నగదు బహుమతితో పాటు ఒక కానన్ కలర్ ప్రింటర్‌ను అందుకున్నారు.
"ఐ లవ్ బహ్రెయిన్" అనే థీమ్ కింద నిర్వహించిన ఈ పోటీ.. బహ్రెయిన్ సంస్కృతి, ప్రకృతి దృశ్యాలు, చారిత్రక కట్టడాలు మరియు సామాజిక స్ఫూర్తిని ఆవిష్కరించింది.
సినిమాటోగ్రాఫర్ మరియు దర్శకుడు అజిత్ నాయర్, వెరానో క్రియేటివ్స్ ఫోటోగ్రఫీ & ఫిల్మ్ ప్రొడక్షన్ వ్యవస్థాపకురాలు సమ్మర్ అమీన్, మార్కెటింగ్ మరియు కార్పొరేట్ కమ్యూనికేషన్స్ స్ట్రాటజిస్ట్ ఫాతిమా ఆర్. అల్షేఖ్లతో సహా ఫోటోగ్రాఫర్లు మరియు నిపుణులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







