యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- June 24, 2026
యూఏఈ: నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) ప్రకారం.. యూఏఈలో వేసవి తీవ్రత పెరుగుతుంది. రాబోయే కొన్ని నెలల పాటు ప్రజలు తీవ్రమైన వేడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు తూర్పు మరియు పర్వత ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నపు తీవ్రమైన వేడిని తప్పించుకోవడానికి చాలా మంది ప్రజలు ఇప్పటికే తమ దినచర్యలను మార్చుకుంటున్నారు. మరోవైపు, ఈ వేసవిలో అత్యంత వేడిగా ఉండే రోజులు ఇంకా ముందున్నాయని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
NCMలోని జనరల్ మెటియోరాలజీ విభాగం తాత్కాలిక అధిపతి ఈసా అల్ సెరీడి మాట్లాడుతూ.. ప్రస్తుతం వేసవికి సంబంధించిన సాధారణ వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. అప్పుడప్పుడు ఉష్ణోగ్రతలు 50°C కంటే ఎక్కువగా పెరగవచ్చని, అయితే అటువంటి తీవ్రమైన పరిస్థితులు ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని ఆయన పేర్కొన్నారు.
తూర్పు, పర్వత ప్రాంతాలలో వర్ష సూచన
ఈ వారం యూఏఈలోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. స్థానికంగా "రవాయే" (Rawayeh) అని పిలువబడే కాలానుగుణ దశలోకి ప్రవేశిస్తున్నందున, కొన్ని ప్రాంతాలలో వర్షాన్నిచ్చే మేఘాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీనివల్ల అక్కడక్కడా వర్షాలు మరియు వారం చివరి నాటికి ఉష్ణోగ్రతలలో స్వల్ప తగ్గుదల ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షపాతం ప్రధానంగా తూర్పు మరియు పర్వత ప్రాంతాలలోనే ఉంటుందని ఈసా అల్ సెరీడి పేర్కొన్నారు.
ఈ వాతావరణ పరిస్థితులు అబుదాబి, దుబాయ్ మరియు షార్జా వంటి ప్రధాన నగర ప్రాంతాల పరిస్థితులకు భిన్నంగా ఉంటాయన్నారు. ఆయా ప్రాంతాల్లో వర్షపాతం కంటే మేఘావృతమైన ఆకాశాన్ని ఎక్కువగా చూసే అవకాశం ఉందని తెలిపారు
వేసవి వర్షాలకు ఆ మేఘాలే కారణం
యుఏఈలో వేసవి వర్షపాతం సాధారణంగా భారీ వాతావరణ వ్యవస్థల వల్ల కాకుండా, స్థానికంగా ఏర్పడే కన్వెక్టివ్ మేఘాల వల్లే సంభవిస్తుందని ఎన్‌సిఎం అధికారి ఈసా అల్ సెరీడి వివరించారు. జూలై మరియు ఆగస్టు నెలల్లో యుఏఈలో స్థానికంగా అభివృద్ధి చెందే కన్వెక్టివ్ మేఘాలను తరచూ చూస్తుంటామని, కానీ ఎక్కువగా, వర్షం తూర్పు ప్రాంతాలలో మరియు కొన్నిసార్లు ఇతర ప్రాంతాలలో కూడా కురుస్తుందన్నారు.
అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణంలోని తేమ మరియు పర్వతమయ భూభాగం కలిసి మేఘాల ఏర్పాటుకు మరియు స్థానిక వర్షాలకు కారణమవుతాయని ఆయన అన్నారు. భారత రుతుపవనాల ప్రభావం కొంత ఉన్నప్పటికీ, యుఏఈలో వేసవి వర్షపాతానికి అదే ప్రధాన కారణం కాదని అల్ అశ్రే స్పష్టం చేశారు. అరేబియా సముద్రం నుండి యూఏఈ వైపు వచ్చే తేమతో పోలిస్తే భారత రుతుపవనాల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇవన్నీ మేఘాలు ఏర్పడటానికి దోహదం చేస్తాయని ఈసా అల్ సెరీడి వివరించారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







