ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- June 25, 2026
దోహా: ఖతార్ లోని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’ అనే పేరుతో ఒక కొత్త డిజిటల్ సేవను అధికారికంగా ప్రారంభించింది. రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు మరియు చట్టవిరుద్ధమైన పద్ధతులను రహస్య మార్గాల ద్వారా నివేదించడానికి వీలు కల్పించేలా ఈ సర్వీసును రూపొందించారు.ఈ మేరకు తన X ప్లాట్‌ఫారమ్‌లో ఒక పోస్ట్ షేర్ చేసింది.
పర్యవేక్షణ యంత్రాంగాలను మెరుగుపరచడానికి మరియు నైతిక ప్రవర్తనను ప్రోత్సహించడానికి జరుగుతున్న విస్తృత ప్రయత్నాన్ని ఇది ప్రతిబింబిస్తుందన్నారు. రియల్ రంగంలో మోసాలను గుర్తించడంలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఈ సర్వీసును ప్రారంభించినట్టు అథారిటీ తెలిపింది.
డేటా రక్షణ మరియు గోప్యతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఈ వ్యవస్థ అభివృద్ధి చేయబడిందన్నారు. సమర్పించిన సమాచారం అంతా సురక్షిత ఛానెళ్ల ద్వారా నిర్వహించబడుతుందని మరియు అత్యంత గోప్యంగా ఉంటుందని వెల్లడించింది.
ఈ సర్వీస్ అనేక డిజిటల్ మార్గాల ద్వారా అందుబాటులో ఉందని అథారిటీ పేర్కొంది. ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లేదా అథారిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా నివేదికలను సమర్పించవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- ఏఐ, 3డీ టెక్నాలజీతో రోడ్డు ప్రమాదాల పునర్నిర్మాణం.. దుబాయ్ పోలీసుల వినూత్న ప్రయోగం
- రాస్ అల్ ఖైమా రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి..11 మంది భారతీయుల గుర్తింపు
- సౌదీ అరేబియాలోని జాజాన్ పోర్టుపై హౌతీ మిలిటెంట్ల దాడి.. స్వల్పంగా దెబ్బతిన్న నౌకాశ్రయం
- అజ్మాన్ ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ 2 నుంచి 4 వరకు ఈద్ అల్ ఎతిహాద్ సెలవులు
- దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో ప్రారంభించిన షేక్ మన్సూర్ బిన్ మహమ్మద్
- దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్.. పంజాగుట్టలో పైలట్ ప్రాజెక్టు
- 14 దేశాల పై అమెరికా సుంకాల మోత..
- అబుదాబి–కొచ్చి ఇండిగో విమానంలో ప్రయాణికుడి పై దాడి.. వ్యక్తి అరెస్ట్
- నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- కవిత బరిలోకి దిగేది ఆ అసెంబ్లీ స్థానం నుండే !!







