తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- June 26, 2026
తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వయోవృద్ధులు, దివ్యాంగులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తీపి కబురు అందించింది. వీరికి ప్రత్యేక కోటా కింద ప్రతిరోజూ 1,000 మందికి ఉచిత దర్శన సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. స్వామివారి దర్శనంతో పాటు ఈ టికెట్ పొందిన భక్తులకు ఉచితంగా ఒక లడ్డూను (రూ.50 విలువైనది) కూడా బహుమతిగా అందించనున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
3 నెలల ముందే ఆన్‌లైన్ బుకింగ్.. మధ్యాహ్నం 3 గంటలకే ఎంట్రీ!
60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటాకు సంబంధించిన దర్శన టికెట్లను టీటీడీ ప్రతి నెలా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. భక్తులు మూడు నెలల ముందే ఈ ఉచిత దర్శన టికెట్లను అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ టికెట్లు పొందిన భక్తులను తిరుమలలోని నంబి ఆలయం వద్ద ఉన్న ప్రత్యేక క్యూలైన్ ద్వారా మధ్యాహ్నం 3:00 గంటల నుంచి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
దళారులను నమ్మొద్దు.. మోసపోతే ఈ నెంబర్‌కు కాల్ చేయండి!
ఇటీవలి కాలంలో తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు, వసతి గదులు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు అమాయక భక్తులను నమ్మించి పెద్ద ఎత్తున సొమ్ము వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారి పట్ల భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరించింది.
ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్: ఎవరైనా దళారులు దర్శన టికెట్ల పేరుతో మిమ్మల్ని సంప్రదిస్తే వెంటనే టీటీడీ అధికారిక హెల్ప్‌లైన్ నెంబర్ 155257 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా కోరారు. భక్తులను మోసం చేసే మధ్యవర్తులు, దళారులపై ప్రత్యేక నిఘా ఉంచామని, అలాంటి వారు పట్టుబడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది.
సోషల్ మీడియా వదంతులు నమ్మకండి!
సీనియర్ సిటిజన్ల దర్శనానికి సంబంధించి గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో (Social Media) రకరకాల తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, వాటన్నింటినీ భక్తులు పూర్తిగా తిరస్కరించాలని టీటీడీ సూచించింది. తిరుమల దర్శనాలు, సేవల గురించిన సరైన సమాచారం మరియు బుకింగ్స్ కోసం కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే సంప్రదించాలని స్పష్టం చేసింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్లుhttp://https://ttdevastanams.ap.in.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







