నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- June 26, 2026
దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. 7.2 తీవ్రతతో..7.5 తీవ్రతతో కేవలం నిమిషం వ్యవధిలో సంభవించిన ఈ భూకంపాల కారణంగా ఇప్పటి వరకు కనీసం 235 మంది ప్రాణాలు కోల్పోగా.. 4,300 మందికిపైగా గాయపడ్డారు. భవనాలు కూలిపోవడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు.ఈ వరుస భూకంపాల అనంతరం దాదాపు 40వేల మంది జాడ తెలియరాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
అమెరికా భూకంప పరిశోధన సంస్థ (యూఎస్జీఎస్) వివరాల ప్రకారం..తొలి భూకంపం 7.2 తీవ్రతతో మోరోన్ పట్టణానికి పశ్చిమంగా సంభవించింది. దాని తరువాత కేవలం నిమిషంలోనే 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం అదే ప్రాంతానికి నైరుతి దిశలో నమోదైంది. ఈ రెండు భూకంపాలు గత దశాబ్దంలో వెనిజులాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఒకటిగా అధికారులు చెబుతున్నారు.
వెనెజువెలా రాజధాని కారకాస్ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ భూప్రకంపనలు సంభవించాయి. అయితే, అత్యంత తీవ్రంగా ప్రభావితమైన లాగువేరాలో మాత్రం పరిస్థితి దయనీయంగా ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు 250 బహుళ అంతస్తుల భవనాలు పూర్తిగా శిథిలాల దిబ్బగా మారినట్లు తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ వెల్లడించారు.
పరిస్థితి తీవ్రంగా మారడంతో తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ దేశవ్యాప్తంగా జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలను రంగంలోకి దించింది.
తాజా వార్తలు
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!







