తగ్గిన పసిడి, వెండి ధరలు
- August 11, 2016
ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో నిన్న జోరుగా పెరిగిన పసిడి, వెండి ధరలు గురువారం కాస్త దిగొచ్చాయి. బంగారం ధర రూ. 150కి పైగా తగ్గగా.. వెండి రూ. 47వేల దిగువకు చేరింది. నగల వ్యాపారులు, నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ లేకపోవడంతో ధరలు తగ్గినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
దేశీయ మార్కెట్లో బంగారం ధర నేడు రూ. 155 తగ్గింది. దీంతో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ. 31,125గా ఉంది. అంతర్జాతీయంగా 0.4శాతం తగ్గి సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,341.50 డాలర్లుగా ఉంది. మరోవైపు రూ. 400 తగ్గడంతో.. బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 46,950గా ఉంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









