కువైట్‌లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- June 27, 2026
కువైట్: తాజా 'లేబర్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్' గణాంకాల ప్రకారం, 2025లో కువైట్‌లో భారతీయులు అతిపెద్ద వలస కార్మిక వర్గంగా నిలిచారు. దేశవ్యాప్తంగా 5,78,900 మంది భారతీయ కార్మికులు ఉపాధి పొందుతున్నారు. గృహ కార్మికులను మినహాయిస్తే, మొత్తం వలస కార్మిక శక్తిలో వీరి వాటా 25.5%గా ఉంది.
2025లో కువైట్ లేబర్ మార్కెట్ స్థిరంగా విస్తరించిందని ఈ నివేదిక వెల్లడించింది. డిసెంబర్ చివరి నాటికి మొత్తం కార్మిక శక్తి 3.04 మిలియన్లకు పెరిగింది. అంతకు ముందు ఏడాది ఇది 2.95 మిలియన్లుగా ఉండేది. 3.3% వార్షిక వృద్ధిని నమోదు చేసింది.
ఇక వలస వర్గాలలో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, 4,67,900 మంది కార్మికులతో (20.6%) ఈజిప్ట్ తర్వాతి స్థానంలో నిలిచింది. కువైట్ పౌరులు 4,41,200 మంది కార్మికులతో మూడవ స్థానంలో ఉన్నారు. బంగ్లాదేశ్, నేపాల్, సిరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక మరియు జోర్డాన్ దేశాలు దేశ కార్మిక శక్తిలో మొదటి 10 స్థానాల్లో నిలిచాయి.
2025లో వలస కార్మికుల సంఖ్య 1.83 మిలియన్లకు పెరిగినప్పటికీ, ప్రైవేట్ రంగ కార్మిక శక్తిలో వారి వాటా స్వల్పంగా తగ్గింది. 2024లో 66.7%గా ఉన్న ఈ వాటా 65.9%కి తగ్గడం, లేబర్ మార్కెట్ కూర్పులో స్వల్ప మార్పును సూచిస్తోందన్నారు.
కువైట్‌లో ప్రైవేట్ రంగం అతిపెద్ద ఉపాధి కల్పన కేంద్రంగా కొనసాగుతోంది. మొత్తం ఉద్యోగాలలో 58.8% (సుమారు 1.79 మిలియన్ల మంది కార్మికులు) ఇక్కడే ఉన్నారు. కీలక రంగాలలో వలస కార్మికుల ఆధిపత్యం కొనసాగుతోంది. వీరిలో దాదాపు సగం మంది హోల్‌సేల్ మరియు రిటైల్ వాణిజ్యం (21.4%), నిర్మాణం (14.3%), మరియు వసతి & ఆహార సేవలు (12.7%) వంటి రంగాలలో పనిచేస్తున్నారు.
ప్రభుత్వ రంగంలో, ముఖ్యంగా అత్యవసర సేవల విభాగంలో వలస కార్మికుల ఉనికిని కూడా ఈ నివేదిక తెలియజేసింది. సుమారు 46,700 మంది వలసదారులు ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేస్తుండగా, 33,100 మంది విద్యా మంత్రిత్వ శాఖలో ఉపాధి పొందుతున్నారు. కువైట్‌లోని గృహ కార్మికుల విభాగంలో మొత్తం 7,73,200 మంది కార్మికులు ఉండగా, వారిలో 3,10,600 మంది భారతీయులు ఉన్నారు. ఇది ఆ విభాగంలో 40.2% వాటాకు సమానం. 1,37,500 మంది గృహ కార్మికులతో శ్రీలంక రెండో స్థానంలో నిలవగా.. 1,34,100 మందితో ఫిలిప్పీన్స్ తర్వాతి స్థానంలో ఉంది.
తాజా వార్తలు
- డీప్‌ఫేక్‌లపై ఖతార్ హోంశాఖ హెచ్చరిక..!!
- రెస్టారెంట్లలో ఉల్లంఘనలపై కెమెరాలతో నిఘా..!!
- న్యాయ వ్యవస్థలో వేగం కోసం అన్ని విభాగాల సమన్వయం అవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్..!
- దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ‘ట్రంప్ టవర్స్’
- ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోకుండా సులభ చెల్లింపు మార్గాలు..దుబాయ్ పోలీసుల అవగాహన
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోసం గూఢచర్యం.. బహ్రెయిన్‌లో ఇద్దరికి జీవిత ఖైదు
- నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లతో లైసెన్స్‌కు దరఖాస్తు..27 మంది పై ఖతార్ నిషేధం
- తెలంగాణలో ముగిసిన SIR ప్రక్రియ!
- ప్రయాణికులకు మరింత భరోసా..5 కీలక సౌకర్యాలను ప్రకటించిన ఎమిరేట్స్







