విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!

- June 28, 2026 , by Maagulf
విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!

యూఏఈ: యూఏఈ ట్రైనింగ్ మిషన్ లో విషాదం చోటుచేసుకుంది. ట్రైనింగ్ సందర్భంగా ఒక సైనికుడు మరణించారు.  వీరమరణం పొందిన ఎమిరాటీ సైనికుడి మృతికి యూఏఈ రక్షణ శాఖ సంతాపం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమం సందర్భంగా 'ఫస్ట్ కార్పోరల్ ఇసా ఘలూమ్ అల్ బలూషి' మరణించారని  తెలిపింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆ శాఖ వెల్లడించలేదు. మరణించిన సైనికుని కుటుంబానికి రక్షణ మంత్రిత్వశాఖ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com