‘హ్యాపీ జర్నీ’ సినిమా అద్భుతంగా వచ్చింది: సీనియర్ నటి అన్నపూర్ణమ్మ
- June 28, 2026
గుత్తా ప్రొడక్షన్స్ & కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్, అభిరామ్ నాయుడు, హార్ట్‌వార్మింగ్ ఎమోషనల్ డ్రామా ‘హ్యాపీ జర్నీ’ టీజర్ లాంచ్
గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న హార్ట్‌వార్మింగ్ ఎమోషనల్ డ్రామా ‘హ్యాపీ జర్నీ’ . అభిరామ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మహిళా భావోద్వేగాలకు ప్రధాన ప్రాధాన్యతనిస్తూ రూపొందుతోంది. బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, తరుణ్ రెడ్డి సహ నిర్మాత . ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణాలను ప్రధానంగా చూపించే ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, పృధ్వీ దండమూడి, వంశీధర్ గౌడ్, రవి శివతేజ పైలా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రతి పాత్రను ఎంతో సహజంగా, భావోద్వేగాలకు దగ్గరగా తీర్చిదిద్దారు. తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు.
టీజర్ లాంచ్ ఈవెంట్లో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు భిన్నంగా ఇందులో నా పాత్ర వుంటుంది. దర్శకుడు నన్ను ఈ పాత్రకు ఎంపిక చేయడం నిజంగా నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఇది చాలా మంచి కథ. మనందరి కథ. మనందరికీ ఎన్నో కథలు, భావోద్వేగాలు ఉంటాయి. అవన్నీ ఈ సినిమా చూసిన తర్వాత మరింతగా అర్థమవుతాయి. ఇది కుటుంబం అంతా కలిసి హాయిగా చూసే సినిమా. ఇంట్లో మన వాళ్లను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నామో చెప్పే నిర్వచనం కూడా ఈ సినిమాలో ఉంది. చాలా మంచి సినిమా. మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ పాత్రలో నేను ఎలా చేశానో థియేటర్లో చూసి ఆశీర్వదించండి. పారిష్ లో షూటింగ్ చేశాం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. నిజంగా ఈ సినిమా నాకు ఒక 'హ్యాపీ జర్నీ'.
నటి ఆమని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. 'హ్యాపీ జర్నీ' నిజంగానే ఒక హ్యాపీ జర్నీ. మేమందరం ఫ్రెండ్స్‌లా కలిసి ఈ సినిమా చేశాం. పారిష్ లో షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశాం. ఇది నాకు చాలా కొత్త అనుభవం. ఇంత పెద్ద లాంగ్ ట్రిప్‌లో ఇంతమంది ఆర్టిస్టులతో కలిసి సినిమా చేయడం ఇదే మొదటిసారి. ఇలాంటి పాత్రలో నన్ను మీరు ఇప్పటివరకు చూసి ఉండరు.
నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. దర్శకుడు అభి గారు ప్రతి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సినిమాలో నిజమైన హీరో, హీరోయిన్ అన్నపూర్ణమ్మ గారే. పారిష్ షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాను. ఝాన్సీ గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు. ప్రతి విషయంలో ఆమె ఎంతో సహాయం చేశారు.
నటి ఝాన్సీ మాట్లాడుతూ.. మంచి సినిమా అయితే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఎన్నోసార్లు నిరూపించారు. 'హ్యాపీ జర్నీ' కూడా అలాంటి మంచి సినిమా. ఏడుగురు మహిళలు ఒక ప్రయాణంలో కలిస్తే ఎంత సరదాగా ఉంటుందో, వారి మధ్య ఏర్పడే బంధం, భావోద్వేగాలు, కన్నీళ్లు ఎంత హృదయాన్ని తాకుతాయో ఈ సినిమా చూపిస్తుంది. ఇది చాలా డిఫరెంట్ కథ. తెలుగు ప్రేక్షకులు మరోసారి ఇలాంటి సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నాను. అభి చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఒక ప్రయాణం ఆధారంగా సినిమా ఎంత అందంగా ఉండొచ్చో ఇందులో చూపించాడు. పారిస్‌కు దగ్గరలో ఉన్న ఒక నగరంలో ఈ సినిమాను షూట్ చేశాం. ఇందులో ప్రతి పాత్రను చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇప్పటివరకు చూడని అన్నపూర్ణమ్మ గారిని ఇందులో చూస్తారు. ఆమె మీ మనసును దోచేస్తారు. మేమందరం చాలా ఫ్రెండ్లీగా ఈ సినిమా చేశాం. త్వరలోనే ఈ సినిమా మీ ముందుకు రాబోతోంది. తప్పకుండా మీ అందరికీ ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది."
నటుడు వంశీధర్ గౌడ్ మాట్లాడుతూ.. ఇది చాలా ఫన్నీగా, లైట్ హార్టెడ్‌గా సాగుతుంది. ఇది ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా. కొత్త అనుభూతిని అందించే సినిమా అవుతుంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది.
దర్శకుడు అభిరామ్ నాయుడు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. టీజర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఈ సినిమా జర్నీ చాలా ఆనందంగా సాగింది. మా జీవితాల్లో ఇది ఒక మరపురాని జ్ఞాపకంగా నిలిచిపోతుంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. టీజర్ చూస్తే ఇది అమ్మాయిల కోసం తీసిన సినిమా అనిపించొచ్చు. కానీ నిజానికి ఇది మగాళ్ల కోసంతీసిన సినిమా. మహిళలు బయటకు చెప్పలేని ఎన్నో భావోద్వేగాలను ఇందులో చూపించాం. మీరు కుటుంబంతో కలిసి ఈ సినిమా చూస్తే ఒక మంచి అనుభూతి కలుగుతుంది. తప్పకుండా మీ కుటుంబ సభ్యులను తీసుకుని రండి. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్లు అందరూ నాకు ఎంతో సహకరించారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. శేఖర్ చంద్ర గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు.
నటి సునయన మాట్లాడుతూ.. ప్రతి నటుడికీ కొత్త తరహా పాత్రలు చేయాలని ఉంటుంది. ఈ సినిమాతో ఒక నటిగా మరింత ఎదిగే అవకాశం దక్కిందని భావిస్తున్నాను. టీజర్లో నన్ను నేను చూసుకుని చాలా సంతోషంగా అనిపించింది. నా పాత్రకు నన్ను ఎంపిక చేసిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఒక నటిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చిన సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.
సహ నిర్మాత తరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. టీజర్ కంటే సినిమా పది రెట్లు అద్భుతంగా ఉంటుంది. 'హ్యాపీ జర్నీ'కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది. మీ అందరి ప్రేమ, ఆదరణ, సహకారం కావాలని కోరుకుంటున్నాను' ఈ వేడుకలో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.
తారాగణం: అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూప శ్రీనివాస్, సునైనా, పృధ్వి దండమూడి, వంశీధర్ గౌడ్, రవి శివతేజ పైలా
సాంకేతిక సిబ్బంది:
రచయిత & దర్శకుడు: అభిరామ్ నాయుడు
నిర్మాతలు: బాలాజీ గుత్తా & కౌశిక్ రెడ్డి
బ్యానర్లు: గుత్తా ప్రొడక్షన్ & కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్
సహ నిర్మాత: తరుణ్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శైలేంద్ర కుమార్
సంగీతం : శేఖర్ చంద్ర
DOP: మణికందన్ సుబ్రమణియన్
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
పబ్లిసిటీ: అనిల్ & భాను
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్‌కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్‌లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్‌లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







