'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- June 28, 2026
విజయవాడ: మాజీ భారత ఉపరాష్ట్రపతి, ప్రజానాయకుడు ముప్పవరపు వెంకయ్య నాయుడు స్ఫూర్తిదాయక జీవితం, విలువలతో కూడిన రాజకీయ ప్రస్థానం, ప్రజాసేవ పట్ల ఆయన అంకితభావం, మాతృభాషపై ఉన్న అపారమైన ప్రేమను ప్రతిబింబించే 'వెంకయ్య నాయకుడు' పుస్తకం పాఠకుల ముందుకు వచ్చింది.
ఈ పుస్తకం వెంకయ్య నాయుడు రాజకీయ, సామాజిక జీవితంలోని కీలక ఘట్టాలను ఆవిష్కరిస్తూ, ఆయన నాయకత్వ లక్షణాలు, ప్రజలతో మమేకమైన తీరు, దేశ సేవలో చేసిన కృషిని వివరిస్తుంది. ముఖ్యంగా విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం భారత ఉపరాష్ట్రపతి పదవి వరకు ఎలా సాగిందో ఈ గ్రంథంలో వివరించారు.
రాజకీయాల్లో విలువలు, నైతికత, ప్రజాసేవకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడిగా వెంకయ్య నాయుడు నిలిచారని, మాతృభాష పరిరక్షణ, భారతీయ సంస్కృతి ప్రచారంలో ఆయన చేసిన కృషికి ఈ పుస్తకం ప్రతిబింబంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ గ్రంథం కేవలం జీవిత చరిత్ర మాత్రమే కాకుండా, యువతకు స్ఫూర్తినిచ్చే మార్గదర్శకంగా, ప్రజాసేవలో విలువలను పాటించాలనుకునే వారికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.
పుస్తక ఆవిష్కరణ విజయవంతం కావాలని, 'వెంకయ్య నాయకుడు' విస్తృత పాఠకాదరణ పొందడంతో పాటు సమాజంలో విలువలతో కూడిన నాయకత్వానికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, మంత్రి కొలుసు పార్ధసారథి, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్,గద్దె రామ్మోహన్ రావు గారు, వై.ఎస్.చౌదరి,బొండా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్‌కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్‌లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్‌లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







