యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్‌ జాక్‌పాట్‌ గెలిచిన రెండవ విజేత..!!

- July 02, 2026 , by Maagulf
యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్‌ జాక్‌పాట్‌ గెలిచిన రెండవ విజేత..!!

యూఏఈ: యూఏఈ లాటరీలో ఒక నెల క్రితం మొదటిసారిగా నేపాల్ నివాసి 30 మిలియన్ దిర్హమ్‌ బహుమతిని గెలుచుకున్న తర్వాత, తాజా లక్కీ డే డ్రాలో మరో అదృష్టవంతుడు 30 మిలియన్ దిర్హమ్‌ల జాక్‌పాట్‌ను గెలుచుకున్నారు. జూలై 1న జరిగిన 260701 నంబర్ డ్రాలో, విజేత టిక్కెట్‌లోని ఆరు 'డేస్ సంఖ్యలు మరియు 'లక్కీ మంత్' సంఖ్య సరిపోలాయి.

విజేత సంఖ్యలు:
డేస్ సంఖ్యలు: 1, 9, 15, 19, 20 మరియు 25
లక్కీ మంత్: 6

లక్కీ ఛాన్స్ విజేతలు
లక్కీ ఛాన్స్ ఫీచర్ ద్వారా ముగ్గురు ఆటగాళ్లు కూడా ఒక్కొక్కరు 50,000 దిర్హమ్‌లు గెలుచుకున్నారు. గెలుపొందిన లక్కీ ఛాన్స్ ఐడీలు:BX4872387, BV4695094. BW4743599
ఈ డ్రా ద్వారా వివిధ బహుమతి శ్రేణులలో వేలాది మంది విజేతలుగా నిలిచారు. ఐదు డేస్ నంబర్లు మరియు లక్కీ మంత్ సంఖ్యను సరిపోల్చిన ఇద్దరు ప్లేయర్లు ఒక్కొక్కరు Dh100,000 గెలుచుకున్నారు. మరో 45 మంది ఒక్కొక్కరు Dh1,000 అందుకోగా, 4,242 మంది ఒక్కొక్కరు Dh100 గెలుచుకున్నారు. ఇక నగదు బహుమతులకు హామీ ఇచ్చే లక్కీ ఛాన్స్ ఫీచర్ ద్వారా మరో ముగ్గురు ప్లేయర్లు ఒక్కొక్కరు Dh50,000 గెలుచుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com