ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- July 02, 2026
మనామా: బహ్రెయిన్‌పై ఇరాన్ దురాగతాలను ప్రశంసించిన ఆరు వేర్వేరు విచారణలలో, హై క్రిమినల్ కోర్టు ఐదు నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షలను విధించింది. ఏడుగురు నిందితులలో కొందరికి 2,000 బహ్రెయిన్ దినార్ల వరకు జరిమానా కూడా విధించారు. ముఖ్యమైన ప్రదేశాలను ఫోటోలు తీయడం, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు లేదా పుకార్లను వ్యాప్తి చేయడం, ఇరాన్ దాడుల పట్ల సానుకూల భావన కలిగిన ప్రసంగాలను పోస్ట్ చేయడం వంటి వివిధ అభియోగాలను నమోదు చేశారు. అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు లేదా వ్యాఖ్యలను ప్రచురించిన సోషల్ మీడియా ఖాతాల గురించి సైబర్‌క్రైమ్స్ డైరెక్టరేట్ నుండి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు ఫిర్యాదుల రావడంతో విచారణ జరిపారు.
గత నెలలో, బహ్రెయిన్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపే దాడులను సమర్థించడం మరియు ప్రోత్సహించడం వంటి నేరాలకు గాను, 11 వేర్వేరు కేసులలోని 12 మంది నిందితులకు ఒక్కొక్కరికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. వారిలో కొందరికి 2,000 బహ్రెయిన్ దినార్ల (BDN) వరకు జరిమానా విధించారు.
అదే విధంగా, బహ్రెయిన్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)తో సహకరించినట్లు దోషులుగా తేలిన తొమ్మిది మందికి మే 24న రెండు వేర్వేరు కేసులలో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరో ఇద్దరికి హై క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష కూడా విధించింది.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







