ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్

- July 02, 2026 , by Maagulf
ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రితో పలు అంశాల పై చర్చించినట్లు తెలిపారు.

సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి, క్రమశిక్షణ, భారత అభివృద్ధి పట్ల అంకితభావం కలిగిన నాయకుడని కొనియాడారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడంతో పాటు ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన నాయకత్వం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

ప్రధానమంత్రిని కలవడం తనకు గౌరవంగా భావిస్తున్నానని, దేశ ప్రగతి కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com