శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్

- July 02, 2026 , by Maagulf
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్

శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 20 మంది మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు ప్రయత్నించిన వీరిని ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. తనిఖీల్లో భాగంగా వీసాలు నకిలీవని తేలడంతో, వారిని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు పోలీసులు ఈ మహిళలను విచారిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com