98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- July 02, 2026
దోహా: మురుగునీటి శుద్ధిలో ఖతార్ మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) 98 శాతం మురుగునీటిని విజయవంతంగా శుద్ధి చేసి, పునర్వినియోగించడంలో విజయం సాధించింది. సుస్థిర నీటి నిర్వహణలో ఇదోక కీలక మైలురాయిగా అధికారులు తెలిపారు. ఈ మేరకు తన అధికారిక X అకౌంట్లో ఒక ప్రకటన విడుదల చేసింది.
తమ మురుగునీటి శుద్ధి మరియు పునర్వినియోగ కార్యక్రమం ద్వారా నీటిపారుదల, భూగర్భ జలాల పునరుద్ధరణ మరియు పర్యావరణ పరిరక్షణకు విలువైన వనరుగా మార్చిందని అష్ఘల్ హైలైట్ చేసింది. మొత్తం నీటి నిర్వహణలో భాగంగా మొత్తం 3.46 బిలియన్ క్యూబిక్ మీటర్ల మురుగునీటిని శుద్ధి చేసి పునర్వినియోగించినట్లు అథారిటీ తెలిపింది. ఇందులో 32 శాతం పచ్చని ప్రదేశాల కోసం, 31 శాతం పశుగ్రాసం పెంపకానికి, 22 శాతం భూగర్భ జల నిల్వలను రిఛార్జి చేసేందుకు వీలుగా జలాశయాలలోకి పంపినట్లు తెలిపింది. ఇక మిగిలిన 14 శాతాన్ని భవిష్యత్ ఉపయోగం కోసం నిల్వ చేసినట్లు పేర్కొంది.
గత దశాబ్ద కాలంలో ఖతార్ యొక్క మురుగునీటి పారుదల మరియు మురుగునీటి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సాధించిన గణనీయమైన పురోగతిని కూడా అస్ఘల్ వెల్లడించింది.
2013 మరియు 2025 మధ్య డ్రైనేజీ నెట్‌వర్క్ 2,836 కిలోమీటర్ల నుండి 9,707 కిలోమీటర్లకు పెరిగి, 207 శాతం విస్తరించింది. ఇది అధికార సంస్థ చేపట్టిన అతిపెద్ద మౌలిక సదుపాయాల విస్తరణ కార్యక్రమాలలో ఒకటిగా నిలిచిందని తెలిపింది. ప్రస్తుత మౌలిక సదుపాయాలలో ఎనిమిది మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, 13 శుద్ధి చేసిన మురుగునీటి (TSE) పంపింగ్ స్టేషన్లు, 71 భూగర్భ మరియు ఉపరితల నీటి పంపింగ్ స్టేషన్లు మరియు 120 మురుగునీటి పంపింగ్ స్టేషన్లు ఉన్నాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







