గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- July 02, 2026
గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం–సహాయనిధి ఫౌండేషన్ మానవతా సేవ
రుద్రంగి/చందుర్తి: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గల్ఫ్ కార్మికుడు యెల్ల శ్రీనివాస్ గంగపుత్ర కుటుంబానికి గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం, సహాయనిధి ఫౌండేషన్ సంయుక్తంగా రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశాయి.
దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్ ఇటీవల సెలవులపై స్వగ్రామానికి వచ్చారు. ఈ సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో సంఘం ప్రతినిధులు శ్రీనివాస్ నివాసానికి వెళ్లి ఆయన భార్యకు రూ.50 వేల నగదు సహాయాన్ని అందించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం, సహాయనిధి ఫౌండేషన్ అధ్యక్షుడు తోకల శంకర్, మాజీ అధ్యక్షుడు సముద్రాల తిరుపతి, తెలంగాణ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మూల పవన్, రాష్ట్ర కన్వీనర్ గుమ్ముల అంజయ్య, జగిత్యాల జిల్లా చైర్మన్ కల్లెడ నరసింహరాజు, తోకల పెద్ద నరసయ్య, తోకల లచ్చయ్య, దేశవేని మురళీధర్, పల్లికొండ శ్రీనివాస్, ఆర్మూరి గంగాధర్, కోరుట్ల చంద్రయ్య, ఎల్లా చిన్న నరసయ్య, ఎల్లా దశరథం తదితరులు పాల్గొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ ఆర్థిక సహాయ కార్యక్రమం విజయవంతం కావడంలో గల్ఫ్ దేశాలు మరియు స్వదేశంలో ఉన్న సంఘం నాయకులు, సభ్యులు విశేష సహకారం అందించారు. సంఘ ఉపాధ్యక్షుడు బింగి రాజు గంగపుత్ర, ప్రధాన కార్యదర్శి పల్లికొండ గంగ నరసన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ సముద్రాల నరేష్, కార్యదర్శి బింగి నరసయ్య, సహాయ కార్యదర్శి కొండూరు శ్రీనివాస్, ఫైనాన్స్ కంట్రోలర్లు మేడి రమేష్, నెన్నల రాజేష్, కోశాధికారి బోరి కిషన్‌తో పాటు గౌరవ సలహాదారులు, కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారు.
ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికులకు లేదా వారి కుటుంబాలకు ఎలాంటి ఆపద వచ్చినా గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం మృతి చెందిన శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో టీం జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు
- బ్రిక్స్ దేశాలతో క్రీడా భాగస్వామ్యానికి ఏపీ సిద్ధం: సీఎం చంద్రబాబు
- సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ సి.వి.ఆనంద్ అభినందనలు
- బీజేపీ కొత్త టీమ్ తో ప్రధాని మోదీ..!
- కార్మికులకు ఆహారం, చల్లని పానీయాలు.. ఇద్దరు మహిళలకు యూఏఈ ప్రభుత్వ సత్కారం
- గచ్చిబౌలి విషాదం పై హైడ్రా సీరియస్..
- ముంబైలో పెట్రోలియం–సహజ వాయువుల స్టాండింగ్ కమిటీ సమావేశాలకు ఎంపీ బాలశౌరి హాజరు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ ఏఐ ఆధారిత అంతర్జాతీయ న్యాయ సేవలు
- 23 ఏళ్ల తర్వాత ఆన్స్‌ర్ మాల్ షార్జా నుంచి దుబాయ్, అబుదాబికు తరలింపు..
- మానవత్వానికి ప్రతీకగా ఖతార్ ప్రవాస తెలుగు సమాజం..







