క్రీడలమంత్రి విజయ్‌గోయల్‌ని హెచ్చరించిన ఒలింపిక్స్ నిర్వాహకులు
- August 12, 2016
క్రీడాకారులను ప్రొత్సహించేందుకు రియోకు వెళ్లిన కేంద్ర క్రీడలమంత్రి విజయ్‌గోయల్‌ని ఒలింపిక్స్ నిర్వాహకులు హెచ్చరించారు. ఇంకోసారి అలాంటి పరిస్థితి వస్తే మంత్రి అక్రిడేషన్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇంతకీ మంత్రి ఏం చేశారు. విషయం ఏంటంటే.. అక్రిడేషన్ లేని వ్యక్తులను అనుమతి లేని వేదికల వద్దకు మంత్రి తనతో తీసుకొని వెళ్లడమే నిర్వాహకులు ఆగ్రహానికి కారణమైంది. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్తామని అధికారులు చెప్పారు. ఈక్రమంలో ఆయన పక్కనున్న వ్యక్తులు ఒలింపిక్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారని కాంటినెంటల్ మేనేజర్ సారా పీటర్సన్.. ఇండియన్ అధికారులకు వివరించారు. ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించామని, జిమ్నాస్టిక్ వేదిక వద్ద కూడా ఇలాగే జరిగిందని గుర్తు చేశారట.
ఈ యవ్వారంపై ఇండియా అధికారి రాకేష్‌గుప్తా స్పందించారు. భారత్- జపాన్ మ్యాచ్ సందర్భంగా వేదిక వద్ద క్రీడాకారులను కలిసేందుకు మంత్రి ప్రయత్నించారు. కానీ అక్కడకు వెళ్లాలంటే స్పెషల్‌గా పాస్ కావాలని తెలుసుకొని ప్లేయర్స్‌ని బయట కలుసుకున్నారని వివరణ ఇచ్చారు. ఈ యవ్వారంపై మంత్రి గోయల్ కూడా స్పందించారు. తాను క్రీడా వేదిక వద్దకు వెళ్లలేదని, వాలంటీర్లు తనను అక్కడకు తీసుకువెళ్లారని గుర్తు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







