ఇరాన్ తీరుపై యూఏఈ ఫైర్.. ఉద్రిక్తతలు తగ్గించే ఆలోచన లేదా?
- July 08, 2026
అబూదాబి: హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన తాజా దాడులు, అలాగే బహ్రెయిన్, కువైట్‌లపై కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు డాక్టర్ అన్వర్ గర్గాష్ ఇరాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి చర్యలు ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కాకుండా, యుద్ధ వాతావరణాన్ని కొనసాగించాలనే తేహ్రాన్ వైఖరిని స్పష్టంగా చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో స్పందించారు గర్గాష్. హోర్ముజ్ జలసంధిలో ఖతార్, సౌదీ అరేబియాకు చెందిన వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, బహ్రెయిన్, కువైట్‌లపై వరుస దాడులు చేయడం ఆందోళనకరమన్నారు. గల్ఫ్ దేశాలు ఇరాన్ కు లక్ష్యంగా మారడం ఆంధోళన కరమని అన్నారు.
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు జరిపిన అనంతరం అమెరికా ప్రతిదాడులు చేపట్టిందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ ఘటనలు గత నెలలో అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై మళ్లీ అనిశ్చితిని పెంచాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, హోర్ముజ్ జలసంధి సమీపంలో ఓ ట్యాంకర్‌ను గుర్తు తెలియని వస్తువు తాకడంతో మంటలు చెలరేగాయని, అనంతరం మరో రెండు నౌకలపై కూడా దాడులు జరిగాని, ఈ ఘటనలు ఒమన్ తీరానికి సమీపంలో చోటుచేసుకున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు రెండు శాతానికి పైగా పెరిగి రెండు వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ ఇంధన సరఫరాపై మళ్లీ ఆందోళనలు నెలకొన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!







