హమద్ టౌన్‌లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!

- July 08, 2026 , by Maagulf
హమద్ టౌన్‌లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!

మనామా: ఉత్తర మున్సిపల్ కౌన్సిల్ ద్వారా పదేపదే ఫిర్యాదులు అందిన నేపథ్యంలో, మున్సిపాలిటీ వ్యవహారాలు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ.. హమద్ టౌన్‌లోని పురావస్తు సమాధుల వద్ద ఉన్న వీధి కుక్కలపై చర్యలను ప్రారంభించింది.

బ్లాక్ 1207లోని పురాతన స్మశానవాటికలలో.. ముఖ్యంగా నాలుగవ మరియు ఏడవ రౌండ్‌అబౌట్‌ల మధ్య కుక్కల సమస్య అధికంగా ఉందని నివాసితుల నుంచి ఫిర్యాదులు అందాయని ఉత్తర మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు అబ్దుల్లా ముబారక్ బిలాల్ అల్ ఖొబైసీ తెలిపారు. రాత్రి సమయంలో వీటి సమస్య అధికంగా ఉంటుందన్నారు.

మంత్రిత్వ శాఖ ఈ ఫిర్యాదును జంతు నియంత్రణ సంస్థకు రిఫర్ చేసిందని, ఆ సంస్థ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, వాటిని తొలగింపును ప్రారంభించిందని అధికారులు తెలిపారు. కుక్కలను పట్టుకోవడం, వాటికి సంతాన నిరోధక ఆపరేషన్లు చేయడం మరియు హఫీరాలో వాటికి తాత్కాలిక ఆశ్రయం కల్పించడం కోసం రాబోయే 30 నెలలపాటు నిర్వహించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.  అలాగే మైక్రోచిప్ ద్వారా పెంపుడు జంతువులను నమోదు చేయడానికి త్వరలోనే చట్టం రాబోతుందన్నారు.

అయితే, కుక్కలను శిక్షించడం కంటే ముందు అవగాహన కల్పించాలని బహ్రెయిన్ సొసైటీ ఫర్ క్యాట్స్ అండ్ డాగ్స్ వైస్-ఛైర్మన్ మహమ్మద్ అల్ మాస్ పిలుపునిచ్చారు. మరోవైపు, బహ్రెయిన్ ఇప్పటికీ రేబీస్ రహిత దేశంగానే ఉందని అధికారులు తెలిపారు. వీధి జంతువుల నిర్వహణపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com