ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం - కేసీఆర్
- August 12, 2016
తమిళనాడు తరహాలో ప్రత్యేక చట్టం తీసుకు వచ్చి ముస్లింలకు జనాభా నిష్పత్రి ప్రకారం 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో ముస్లింలు అత్యంత పేదరికంలో ఉన్నారని, వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడానికి రిజర్వేషన్లు తప్పనిసరి అని ఆయన శుక్రవారమిక్కడ పేర్కొన్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో చట్టం తెస్తామని కేసీఆర్ తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఎస్టీలు తీవ్రంగా నష్టపోయారని, ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ముస్లింలు, ఎస్టీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎస్టీలు, ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం జరిపిన సుధీర్, చెల్లప్ప కమిషన్లు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నివేదిక అందచేశాయి. కాగా తెలంగాణలోని పది జిల్లాలో ఎస్టీల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ చెల్లప్ప, సుధీర్ కమిషన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







