చెన్నై 2 సింగపూర్ చిత్రం ఆరు దేశాల్లో
- August 12, 2016
ఈ నాగరిక ప్రపంచంలో సినిమాకు గ్లోబల్ ప్రచారం చాలా అవసరమైందని చెప్పక తప్పదు. ఒక తమిళ సినిమా ప్రపంచ స్థాయికి దూసుకుపోతోందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా చెన్నై 2 సింగపూర్ చిత్రం ఆరు దేశాల్లో ప్రచారానికి సిద్ధమైంది. అందుకు పాటలను, ప్రచార చిత్రాన్ని వాడుకోనుంది. చిత్ర యూనిట్ చెన్నై నుంచి మధ్యలో నాలుగు దేశాలను కలుపుకుని రోడ్డు ప్రయాణంలో సింగపూర్‌కు చేరుకోనున్నారు.అందుకు గురువారం శ్రీకారం చుట్టారు. కామిక్ బుక్ ఫిలింస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కే.ఆనందన్ నిర్మిస్తున్న చిత్రం చెన్నై 2 సింగపూర్. షబ్బీర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అబ్బాస్ అక్బర్ దర్శకుడు. గోకుల్ ఆనంద్, అంజుకురియన్, రాజేశ్ బాల చంద్రన్, ఎంసీ.జేస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ నలముత్తు చాయగ్రహణం, జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలోని తొలి పాటను చెన్నైలోని సత్యం థియేటర్లో గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఇతర ఐదు దేశాల్లో ఐదు పాటలను ఆవిష్కరించడానికి రోడ్డు పయాణానికి గురువారం శ్రీకారం చుట్టారు. దీనికి నటుడు సూర్య జెండా ఊపి ఒక కొత్త ప్రయత్నానికి రెడీ అవుతున్న చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చిత్రం యూనిట్ చెన్నైలో బయలుదే రి బూటాన్, మయన్మార్, థాయ్‌ల్యాండ్, మలేషియా దేశాల మీదుగా సింగపూర్ చేరుకుంటుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. ఈ పయనం మొత్తం 20 రోజులు సాగుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









