రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- July 09, 2026
రాస్ అల్ ఖైమా: రాస్ అల్ ఖైమా పాలకుడు, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు హిజ్ హైనెస్ షేక్ సౌద్ బిన్ సఖర్ అల్ ఖాసిమీ భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్‌ను గురువారం తన రాజభవనంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశానికి భారత వ్యాపారవేత్తల ప్రతినిధి బృందం కూడా హాజరైంది.
ఈ సందర్భంగా షేక్ సౌద్ బిన్ సఖర్ అల్ ఖాసిమీ భారత రాయబారికి, ఆయనతో వచ్చిన ప్రతినిధి బృందానికి ఆత్మీయ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్–భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, వివిధ రంగాల్లో సహకారాన్ని విస్తరించడం ద్వారా ఇరు దేశాల ప్రజల అభివృద్ధి, శ్రేయస్సుకు తోడ్పడే అంశాలపై ఇరువురు చర్చించారు.
రాస్ అల్ ఖైమా ఎమిరేట్ మరియు భారతదేశం మధ్య పెట్టుబడులు, వాణిజ్యం, పారిశ్రామిక రంగాల్లో భాగస్వామ్య అవకాశాలను విస్తరించడంతో పాటు, ఎమిరేట్‌కు ఉన్న ఆర్థిక, వ్యాపార అవకాశాలను మరింతగా వినియోగించుకునే మార్గాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరు పక్షాలు అభిప్రాయాలు పంచుకున్నాయి.
ఈ సందర్భంగా భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్, ఆయనతో వచ్చిన ప్రతినిధి బృందం షేక్ సౌద్ బిన్ సఖర్ అల్ ఖాసిమీ అందించిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. యూఏఈ–భారత్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను వారు ప్రశంసించారు. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో యూఏఈ సాధించిన గుర్తింపుతో పాటు రాస్ అల్ ఖైమా ఎమిరేట్‌లో వివిధ రంగాల్లో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని కొనియాడారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







