విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం

- July 10, 2026 , by Maagulf
విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం

విజయవాడ: విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు, విజయవాడ ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ వల్లభనేని బాలశౌరి అధ్యక్షత వహించారు.

సమావేశంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు, ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ కో-ఛైర్మన్ కేశినేని శివనాథ్ (చిన్ని), గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, విజయవాడ విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంతా రెడ్డి, ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన, మౌలిక వసతుల విస్తరణ, విమాన సర్వీసుల పెంపు, భద్రతా ప్రమాణాల బలోపేతం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

విమానాశ్రయాన్ని మరింత ఆధునికంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సమావేశంలో అధికారులు నిర్ణయించారు. అలాగే వివిధ శాఖల మధ్య సమన్వయంతో విమానాశ్రయ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరాన్ని సభ్యులు ప్రస్తావించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com