మంగాత్తా-2 లో అజిత్..
- August 12, 2016
ప్రస్తుతం సీక్వెల్ ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు. ఎందిరన్ వంటి భారీ చిత్రాల నుంచి చెన్నై-28 లాంటి చిన్న బడ్జెట్ చిత్రాల వరకూ సీక్వెల్స్ తయారవుతున్నాయి.తాజాగా మంగాత్తా-2 చెయాలన్న కోరికను ఆ చిత్ర దర్శకుడు వెంకట్‌ప్రభు వ్యక్తం చేశారు. అజిత్ సినీ కేరీర్లో ఒక మైలురాయిగా నిలిచిన చిత్రం మంగాత్తా. త్రిష, ఆండ్రియా, రాయ్‌లక్ష్మీ, అంజిలి అంటూ పెద్ద తారాగణమే నటించిన చిత్రం ఇది. ప్రధాన పాత్రలో యాక్షన్‌కింగ్ అర్జున్ నటించిన ఈ చిత్రం ఐదేళ్ల ముందు తెరపైకి వచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.పలు ట్విస్ట్‌లతో రూపొందించిన మంగాత్తా చిత్రంలో ముఖ్యంగా చివరి ఘట్ట దృశ్యాలు ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తాయి. అలాంటి చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ఊహించారు. వారి ఊహలను నిజం చెయాలన్న ఆలోచనలో దర్శకుడు వెంకట్‌ప్రభు ఉన్నారు. ఇటీవల ఒక భేటీలో ఆయన ఈ విషయాన్ని వ్యక్తం చేశారు. అయితే దీనికి నటుడు అజిత్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి.ఆయన ప్రస్తుతం తన 57వ చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించారు.అదే విధంగా దర్శకుడు వెంకట్‌ప్రభు చెన్నై-28కు సీక్వెల్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి శింబు హీరోగా బిల్లా 2018 చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







