సినిమా రివ్యూ: ‘లెనిన్’.!
- July 10, 2026
అఖిల్ అక్కినేని లాంగ్ గ్యాప్ తర్వాత నటించిన సినిమా ‘లెనిన్’. ప్రజెంట్ ట్రెండ్‌లో హీరోలు డిఫరెంట్ మేకోవర్‌తో కనిపిస్తూ, పవర్ ఫుల్ సబ్జెక్టుల్లో నటిస్తున్నారు. రెట్రో లుక్స్‌లోకి ట్రాన్స్‌ఫామ్ అవుతున్నారు. అలాగే, అఖిల్ కూడా రెట్రో అండ్ మాస్ లుక్ ట్రై చేశాడు ‘లెనిన్’ కోసం. అయితే, అఖిల్‌కి ‘లెనిన్’ ఎంత వరకూ యూజ్ అయ్యింది.? అంచనాల్ని అందుకునేలా ‘లెనిన్’ సక్సెస్ ఇస్తుందా.? తెలియాలంటూ ‘లెనిన్’ సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
.కథ:
చిత్తూరులోని భారతం మిట్ట అనే ఊరులో ‘లెనిన్’ కథ స్టార్ట్ అవుతుంది. ఎవ్వరూ లేని అనాధ అయిన లెనిన్ (అక్కినేని అఖిల్)ని ఆదరించి తన కుటుంబంలో ఒకడిగా చేసుకుంటాడు వసంత్ (ప్రమోద్ పంజు). చిన్నతనం నుంచీ వసంత్ అంటే తనకు ప్రాణం. కాల క్రమంలో అదే ఊరమ్మాయి అయిన భారతి (భాగ్యశ్రీ బోర్సే)ని స్నేహితుడి తర్వాత అంతగా ఇష్టపడతాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటారు భారతి, లెనిన్. కానీ, కాలం మరోలా ఆలోచిస్తుంది. కొన్ని ఊహించని పరిస్థితులు లెనిన్ జీవితాన్ని మార్చేస్తాయ్ ఆ పరిస్థితులేంటీ.? లెనిన్ ఎందుకు జైలుకెళ్లాల్సి వస్తుంది.? తన ప్రాణ స్పేహితుడిలో వచ్చిన మార్పేంటీ.? పెళ్లి చేసుకోవాలనుకున్న భారతికి ఏమైంది.? ఈ పరిస్థితులను లెనిన్ ఎలా ఎదుర్కొన్నాడు.? తాను అనుకున్నవి సాధించుకోగలిగాడా.? తెలియాలంటే ‘లెనిన్’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
అఖిల్ అక్కినేని నుంచి ఇంతవరకూ వచ్చిన సినిమాలన్నింటికీ ఎలాంటి టాక్ వచ్చిందో తెలిసిందే. స్టార్ అవ్వాలనుకున్న అఖిల్ అంతంత మాత్రంగానే నిలుస్తూ వచ్చాడింతవరకూ. కానీ, ‘లెనిన్’ సినిమా నటుడిగా అఖిల్‌ని మరో మెట్టు ఎక్కిస్తుందనడం అతిశయోక్తి అనిపించదు. అంతలా ట్రాన్స్‌ఫామ్ అయ్యాడు ఈ సినిమా కోసం. మాస్ లుక్స్‌లో కనిపించి ఆకట్టుకోవడంతో పాటూ, యాక్షన్ అండ్ ఎమోషన్స్ సీన్లలోనూ కట్టిపడేశాడు. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాల్లో అఖిల్ తన నెక్స్‌ట్ లెవల్ పర్‌ఫామెన్స్ చూపించాడు. ఆ తర్వాత భాగ్యశ్రీ బోర్సే.. చాలా అందంగా కనిపిస్తూనే ఆకట్టుకునే నటన కనబరిచింది. స్కోపున్న పాత్రే దక్కింది ఈ సినిమాలో భాగ్యశ్రీకి. అన్ని ఎమోషన్లలోనూ తనదైన బెస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత సర్‌ప్రైజింగ్ పర్‌ఫామర్ కన్నడ నటుడు ప్రమోద్ పంజు. డిఫరెంట్ వేరియేషన్స్ వున్న పాత్రలో కనిపించి మెప్పించాడు. ఎత్తిరాజులు పాత్రలో శివాజీ పాత్ర ఆకట్టుకుంటుంది. ఈశ్వరీ రావు, బ్రహ్మాజీ, సునీల్, గెటప్ శీను, శత్రు తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
మహా భారతం బ్యాక్ డ్రాప్‌లో సాగే కథ లెనిన్. అందులో వున్నట్లుగానే ఆయా పాత్రల చిత్రీకరణ, వాటి మధ్య కుట్రలు, కుతంత్రాలూ, ప్రేమ, స్నేహం, ద్రోహం.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌నీ ఈ సినిమాలో చొప్పించాడు దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు. అయితే, కథనం నడిపించడంలో అక్కడక్కడా కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. దాంతో, రొటీన్ స్టోీరీనే అనే ఫీల్ కలుగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ బాగా కట్ చేశాడు. ఇక్కడి ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఆటోమెటిగ్గా క్యూరియాసిటీ పెరుగుతుంది. అందుకు తగ్గట్లుగానే సెకండాఫ్‌లో ఊహకు మించి ట్విస్టులు రివీల్ అవుతూ వుంటాయ్. పాత్రల రంగులు మారుతుంటాయి. ఇక, ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్స్ ఆడియన్స్‌ని కట్టి పడేస్తాయి.క్లైమాక్స్‌లోని ట్విస్టుకి ఫ్యాన్స్ ఫిదా అవుతారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండా సాగే ఆ ప్రత్యేకమైన ఎపిసోడ్‌లో అఖిల్ ప్రత్యేకమైన పర్‌ఫామెన్స్‌తో సర్‌ప్రైజ్ చేస్తాడు. ఇక ఈ సినిమాకి నేపథ్య సంగీతం అదనపు బలంగా చెప్పొచ్చు. హీరోయిన్‌తో డ్యూయెట్ సాంగ్స్.. అలాగే యాక్షన్ బ్లాక్స్‌లో బీజీఎమ్ అదరగొట్టేవాడు థమన్. నవీన్ నూలి ఎడిటింగ్‌పై ఇంకాస్త ఫోకస్ పెట్టి వుంటే బావుండేది. ఫస్టాఫ్‌లో చాలా సన్నివేశాలు అనవసరంగా, బోరింగ్‌గా సాగతీతలా అనిపిస్తుంటాయ్. నాగార్జున బాగస్వామ్యంలో నిర్మాణ విలువలు బాగున్నాయ్. అప్పటి పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌ని తెరపై చూపించిన విధానం బాగుంది. సినిమాటోగ్రఫీ గొప్పతనం. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ వర్క్ బాగుంది.
ప్లస్ పాయింట్స్:
అఖిల్ పర్‌ఫామెన్స్, సెకండాఫ్‌లో వచ్చే ఊహించని ట్విస్టులు, ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్..
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్, రొటీన్ స్టోరీ, చాలా రొటీన్ అనిపించిన కొన్ని సన్నివేశాలు..
చివరిగా:
అక్కినేని ఫ్యాన్స్‌కి ఫుల్ ఖుషీ. అలాగే, సినిమాటిక్ లాజిక్స్ ఆశించకుండా వెళితే, ధియేటర్లలో ఒకసారి చూడదగ్గ బొమ్మే ‘లెనిన్’.!
తాజా వార్తలు
- కువైట్‌లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్‌లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!







