సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- July 12, 2026
రియాద్: సౌదీ అరేబియాలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో బహ్రెయిన్‌కు చెందిన ఓ మహిళ, ఓ చిన్నారి మృతి చెందారు. ఈ ఘటనలపై సౌదీలోని బహ్రెయిన్ రాయబార కార్యాలయం సంబంధిత అధికారులతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురికాగా, అందులో ప్రయాణిస్తున్న బహ్రెయిన్‌కు చెందిన ఓ మహిళ మృతి చెందింది. మరో ముగ్గురు బహ్రెయిన్ పౌరులు గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారికి అవసరమైన వైద్య చికిత్స అందుతోందని రాయబార కార్యాలయం తెలిపింది. బాధితులకు కాన్సులర్ సేవలు అందించడంతో పాటు వారిని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు కూడా చేపడుతోందని తెలిపారు.
మరో ఘటనలో, రియాద్‌కు దక్షిణంగా సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న హవ్తత్ బని తమీమ్ ప్రాంతంలో ఏడుగురు సభ్యులతో ప్రయాణిస్తున్న బహ్రెయిన్ కుటుంబం కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా, మిగిలిన కుటుంబ సభ్యులు హవ్తత్ బని తమీమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదిలా ఉండగా, మక్కా–మదీనా మార్గంలో జరిగిన బస్సు ప్రమాదంలో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన ఇద్దరు బహ్రెయిన్ పౌరులు మదీనాలోని కింగ్ ఫహద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారితో పాటు వారి పేరెంట్స్ ఉన్నారు. మరో 13 మంది బహ్రెయిన్ పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు బహ్రెయిన్ రాయబార కార్యాలయం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమాన్‌లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్టు రెన్యువల్‌కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!







