కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!

- July 12, 2026 , by Maagulf
కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!

కువైట్ : కింగ్ ఫైసల్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ రోడ్డు (రోడ్ నంబర్ 50) పై భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. రోడ్డు మెయింటెనెన్స్ కారణంగా ఈ మార్గంలోని కుడి మరియు మధ్య లేన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

థర్డ్ రింగ్ రోడ్ ఎగ్జిట్ (ఖాల్దియా ప్రాంతానికి ఎదురుగా) నుండి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు వెళ్లే మార్గం నుంచి ఫోర్త్ రింగ్ రోడ్డుకు దారితీసే ఎగ్జిట్ వరకు ఈ మూసివేత ఆంక్షలు వర్తిస్తాయని ప్రకటించారు. దీంతో పాటు, ఖాల్దియా ప్రాంతంలోని రియాద్ రోడ్డుపై ఉన్న సలీం బిన్ అలీ బుఖ్మాజ్ స్ట్రీట్ ఎంట్రీ మరియు ఎగ్జిట్‌లను కూడా తాత్కాలికంగా మూసివేయనున్నారు.

ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని ట్రాఫిక్ అధికారులు స్పష్టం చేశారు. వాహనదారులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని మరియు ప్రయాణ ఆలస్యాన్ని నివారించడానికి ట్రాఫిక్ సూచికలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com