ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- July 12, 2026
దోహా: ఇరాన్ జరిపిన దాడులను ఖతార్ వైమానిక రక్షణ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. అయితే, ఈ ఆపరేషన్ల కారణంగా ఆకాశం నుండి కిందపడిన శకలాల (debris) వల్ల ఒక చిన్నారి సహా మొత్తం ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) వెల్లడించింది. గాయపడిన వారికి ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నది.
అలాగే, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపిన మంత్రిత్వ శాఖ తెలిపింది. దాడుల అనంతరం భద్రతా బలగాలు, సివిల్ డిఫెన్స్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొంది. ప్రజా రక్షణ కోసం అదనపు ముందస్తు జాగ్రత్తలు అవసరమైనప్పుడు మాత్రమే జాతీయ ప్రజా భద్రతా హెచ్చరికలు (Emergency Alerts) జారీ చేయబడతాయని అధికారులు స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో ఎలాంటి వదంతులు, ధృవీకరించని సమాచారం, వీడియోలు లేదా ఫోటోలను షేర్ చేయవద్దని... కేవలం అధికారికంగా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రజలను కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ప్రజల భద్రత కోసం భద్రతా విభాగాలు నిరంతరాయంగా, పూర్తి అప్రమత్తతతో పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్







