బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!

- July 12, 2026 , by Maagulf
బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!

లండన్: బహ్రెయిన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (Bahrain EDB) ప్రతినిధి బృందం యునైటెడ్ కింగ్‌డమ్‌ (UK) లో ఐదు రోజుల పాటు జరిపిన పర్యటన విజయవంతంగా ముగిసింది. సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ మంత్రి, బహ్రెయిన్ ఈడీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గౌనూర్ బింత్ అలీ అల్ ఖులైఫ్ నాయకత్వంలో ఈ పర్యటన జరిగింది. బహ్రెయిన్, బ్రిటన్ మధ్య ఉన్న ఆర్థిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగిందన్నారు.

ఈ పర్యటనలో భాగంగా బ్రిటన్ పెట్టుబడుల శాఖ సహాయ మంత్రి లార్డ్ జేసన్ స్టాక్‌వుడ్‌తో నూర్ బింత్ అలీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల సంతకమైన UK-GCC స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) నేపథ్యంలో రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి అవకాశాలను విస్తరించడంపై వారు చర్చించారు.

అలాగే, వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, గ్లోబల్ హెల్త్‌కేర్ లీడర్లు, ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్నాలజీ, టూరిజం, తయారీ రంగాల ప్రతినిధులు మరియు 'ఫ్యామిలీ ఆఫీస్' పెట్టుబడిదారులతో నాలుగు ప్రతిష్టాత్మక రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించారు. గల్ఫ్ (GCC) మార్కెట్లకు బహ్రెయిన్ ఒక ప్రధాన ద్వారంగా (Gateway) ఎలా ఉపయోగపడుతుందో ఈ సందర్భంగా ప్రతినిధి బృందం వివరించింది.

బహ్రెయిన్ రేసింగ్ రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే దిశగా ‘రషీద్ ఈక్వెస్ట్రియన్ & హార్స్‌రేసింగ్ క్లబ్’ (REHC) 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, న్యూమార్కెట్‌లో జరిగిన 'దేబెన్‌హామ్స్ జూలై ఫెస్టివల్' రేసింగ్ ఈవెంట్‌లో ఈడీబీ పాల్గొంది. ఈ వేదికగా కూడా బ్రిటన్ ఇన్వెస్టర్లతో కీలక చర్చలు జరిపింది.

బహ్రెయిన్ అంతర్జాతీయంగా వాణిజ్య, ఆర్థిక అవకాశాలను విస్తరించడంలో ఈ పర్యటన అత్యంత కీలక మైలురాయిగా నిలిచిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com