దమ్మామ్–రియాద్ ఎక్స్‌ప్రెస్‌వే విస్తరణకు శ్రీకారం..

- July 13, 2026 , by Maagulf
దమ్మామ్–రియాద్ ఎక్స్‌ప్రెస్‌వే విస్తరణకు శ్రీకారం..

రియాద్: సౌదీ అరేబియాలో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రహదారుల్లో ఒకటైన దమ్మామ్–రియాద్ ఎక్స్‌ప్రెస్‌వేను విస్తరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు కింద ప్రస్తుతం ఉన్న రహదారికి నాలుగు కొత్త లేన్లు జోడించనుండటంతో వాహనాల రాకపోక సామర్థ్యం గణనీయంగా పెAరగనుంది.

ఈ విస్తరణతో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు రహదారి భద్రత మరింత మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. అలాగే సరకు రవాణా, ప్రయాణికుల రాకపోకలు మరింత వేగవంతం కావడంతో రియాద్ మరియు ఈస్టర్న్ ప్రావిన్స్ మధ్య అనుసంధానం బలోపేతం కానుంది.

ప్రాజెక్టు ద్వారా కీలక మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడంతో పాటు దేశంలోని లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

ఈ విస్తరణ పనులు సౌదీ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా చేపడుతున్న కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగమని అధికారులు పేర్కొన్నారు. రహదారి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు, వాణిజ్య రవాణా, ప్రాంతీయ అనుసంధానం మరింత బలోపేతం అవుతాయని వారు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com