బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్‌ఫామ్‌కు నష్టం: కువైట్
- July 13, 2026
కువైట్ సిటీ: కువైట్‌పై ఆదివారం జరిగిన దాడుల్లో దేశ ఉత్తర సరిహద్దులోని మూడు భూ సరిహద్దు పోస్టులు, కువైట్ ఆయిల్ కంపెనీకి చెందిన సముద్రంలోని చమురు డ్రిల్లింగ్ ప్లాట్‌ఫామ్ దెబ్బతిన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు గాయపడగా, అతనికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది.
కువైట్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ప్రకారం, కువైట్ గగనతలంలోకి ప్రవేశించిన శత్రువుల వైమానిక లక్ష్యాలను సైన్యం విజయవంతంగా అడ్డుకుని కూల్చివేసిందన్నారు. దేశ భద్రత, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు సైన్యం పూర్తిస్థాయి అప్రమత్తతతో సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది.
మరోవైపు, కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. ఇవి కువైట్ భద్రత, పౌరులు, ప్రవాసుల రక్షణకు ప్రత్యక్ష ముప్పుగా అభివర్ణించింది. అదేవిధంగా బహ్రెయిన్, ఒమన్, ఖతార్, జోర్డాన్‌లపై జరిగిన దాడులను కూడా కువైట్ ఖండించింది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీసే అన్ని చర్యలను వెంటనే నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







