భారత్ నుంచి బహ్రెయిన్‌కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!

- July 14, 2026 , by Maagulf
భారత్ నుంచి బహ్రెయిన్‌కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!

మనామా: 2026 తొలి ఐదు నెలల్లో భారత్ నుంచి బహ్రెయిన్‌కు 111.19 మిలియన్ బహ్రెయిన్ దినార్ (BD) విలువైన వస్తువులు దిగుమతి అయినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ కాలంలో మొత్తం సుమారు 282 మిలియన్ కిలోల సరుకులు భారత్ నుంచి బహ్రెయిన్‌కు చేరాయి.

మొత్తం దిగుమతుల్లో అల్యూమినా విలువ, పరిమాణం పరంగా అగ్రస్థానంలో నిలిచింది. అల్యూమినియం తయారీలో ఉపయోగించే ఈ ముడి పదార్థాన్ని బహ్రెయిన్ BD11.86 మిలియన్ల విలువతో, 67.2 మిలియన్ కిలోలకు పైగా దిగుమతి చేసుకుంది.

అన్‌రాట్ అల్యూమినియం (Unwrought Aluminium) దిగుమతులు BD6.16 మిలియన్లు కాగా, వాటి బరువు 4.87 మిలియన్ కిలోలు. అనంతరం అల్యూమినియం వైర్ BD6.12 మిలియన్ల విలువతో, 4.74 మిలియన్ కిలోల పరిమాణంలో దిగుమతి అయింది.

సెమీ-ఫినిష్డ్ ఇనుము, ఉక్కు ఉత్పత్తులు BD5.14 మిలియన్ల విలువతో, 33.12 మిలియన్ కిలోలు  దిగుమతి అయ్యాయి. ఫ్రోజన్ బీఫ్ దిగుమతుల విలువ BD4.15 మిలియన్లు, 2.08 మిలియన్ కిలోలకు పైగా నమోదైంది.

అదే విధంగా కాస్ట్-ఐరన్ పైపులు, ట్యూబులు BD3.19 మిలియన్ల విలువతో, 14.59 మిలియన్ కిలోల పరిమాణంలో దిగుమతి అయ్యాయి.

బంగారు ఆభరణాలు మాత్రం తక్కువ బరువుతో అధిక విలువ కలిగిన దిగుమతులుగా నిలిచాయి. కేవలం 46 కిలోల బంగారు ఆభరణాల విలువ BD1.86 మిలియన్లుగా నమోదైంది.

ఇక మెడిసిన్స్ BD1.77 మిలియన్ల విలువతో, 90,500 కిలోల బరువుతో దిగుమతి కాగా, 1,501 సీసీ నుంచి 3,000 సీసీ సామర్థ్యం గల ప్రైవేట్ కార్లు BD1.56 మిలియన్ల విలువతో, 3.64 లక్షల కిలోల బరువుతో భారత్ నుంచి బహ్రెయిన్‌కు దిగుమతి అయినట్లు గణంకాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com