భారత్ ఇకపై హార్ముజ్ జలసంధి పై ఆధారపడదు
- July 16, 2026
పశ్చిమ ఆసియాలో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సాయుధ ఘర్షణలు ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ యుద్ధ ప్రభావం చమురు సరఫరాపై విపరీతంగా పడుతోంది. ముఖ్యంగా భారతదేశ ఇంధన భద్రత, సరఫరా మార్గాల స్వరూపాన్ని ఇది పూర్తిగా మారుస్తోంది. యుద్ధం కారణంగా ఎదురవుతున్న తీవ్రమైన ప్రమాదాలను నివారించేందుకు.. భారతీయ రిఫైనరీలు, చమురు దిగుమతిదారులు సరికొత్త వ్యూహాత్మక మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ ప్రాంతం నుండి ఇంధన సరఫరాలను సురక్షితంగా భారతదేశానికి చేర్చడానికి, వారు సాంప్రదాయకంగా ఉపయోగించే అత్యంత సంక్లిష్టమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) షిప్పింగ్ మార్గానికి వెలుపల ఉన్న ఒమన్ గల్ఫ్ వెంబడి గల ఓడరేవులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.
యుద్ధ మేఘాలు కొత్త ఆందోళనలు
ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన ఫుజైరా, ఖోర్ ఫక్కాన్ ఓడరేవులు ప్రస్తుతం భారతీయ చమురు దిగుమతులకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. వాణిజ్య నౌకలపై దాడులు శరవేగంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో. హార్ముజ్ జలసంధికి తూర్పు వైపున ఉన్న యూఏఈకి చెందిన ఈ ప్రత్యామ్నాయ ఓడరేవులు భారతదేశ ఇంధన అవసరాలకు ఒక జీవనాధారంగా నిలుస్తున్నాయి. దీనితో పాటు.. ప్రమాదకరమైన జలమార్గాన్ని దాటకుండా ఉండేందుకు భారతీయ రిఫైనరీలు యూఏఈకి చెందిన 406 కిలోమీటర్ల పొడవైన హబ్షాన్-ఫుజైరా వ్యూహాత్మక చమురు పైప్‌లైన్‌ను కూడా ఒక సమర్థవంతమైన ప్రత్యామ్నాయ మార్గంగా వినియోగిస్తున్నట్లు ఈ రంగానికి చెందిన నిపుణులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన.. అయితే ఈ సరికొత్త ప్రత్యామ్నాయ మార్గాలు భారతదేశానికి కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తున్నప్పటికీ… యుద్ధ మేఘాలు కొత్త ఆందోళనలను రేకెత్తిస్తూనే ఉన్నాయి. ఈ ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను.. రేవులను కూడా తాము లక్ష్యంగా చేసుకుంటామని బుధవారం టెహ్రాన్ (ఇరాన్) హెచ్చరించినట్లు వచ్చిన తాజా నివేదికలు భారతీయ ఇంధన మార్కెట్లో.. దిగుమతిదారులలో సరికొత్త ఆందోళనలకు కారణమవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం వాటా కలిగిన అత్యంత వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో గల్ఫ్ ప్రాంతం నుండి సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







