మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- July 16, 2026
మనామా: సోషల్ మీడియాలో మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఓ మహిళకు బహ్రెయిన్ కోర్టు ఒక నెల జైలు శిక్ష విధించింది. ఆమె ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకోవాలని లోయర్ క్రిమినల్ కోర్టు ఆదేశించింది.
ఎలక్ట్రానిక్ క్రైమ్స్ ప్రాసిక్యూషన్ విభాగం అధిపతి తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తింపు పొందిన ఒక మత శాఖను బహిరంగంగా అవమానిస్తూ, ఆ మతానికి సంబంధించిన ఆచారాలను కించపరిచేలా ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళ వ్యాఖ్యలు పోస్టు చేసింది. ఈ వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టే అవకాశం ఉన్నట్లు ఎలక్ట్రానిక్ క్రైమ్స్ డైరెక్టరేట్ సోషల్ మీడియా పర్యవేక్షణలో గుర్తించింది.
దర్యాప్తులో ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా యజమానిని గుర్తించిన అధికారులు, కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపించారు. విచారణలో మహిళ తన అకౌంట్ తనదేనని, వివాదాస్పద వ్యాఖ్యను తానే పోస్టు చేసినట్లు అంగీకరించింది.
దీంతో ఆమెను అదుపులోనే సంబంధిత కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఒక నెల జైలు శిక్ష విధించడంతో పాటు, నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవాలని తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్‌లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







