జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు!

- July 16, 2026 , by Maagulf
జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు!

భారత స్టార్ షట్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో సరికొత్త రికార్డు సృష్టించింది. టోక్యో వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ అయిన చైనా క్రీడాకారిణి హాన్ యూను వరుస గేమ్‌లలో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఘనంగా ప్రవేశించింది. ప్రస్తుత సీజన్లో పీవీ సింధుకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.

చైనా షట్లర్‌ పై 35 నిమిషాల్లోనే ఏకపక్ష విజయం!

రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్ అయిన పీవీ సింధు.. తనకంటే ఉన్నత ర్యాంకులో ఉన్న చైనా షట్లర్‌ను కేవలం 35 నిమిషాల్లోనే 21-16, 21-14 తేడాతో చిత్తు చేసింది. మ్యాచ్ ప్రారంభంలో పీవీ సింధు కాస్త నెమ్మదిగా ఆడినప్పటికీ.. మొదటి గేమ్ మధ్యలోకి వచ్చేసరికి పూర్తి ఫామ్ అందుకుంది. కోర్టులో చురుగ్గా కదులుతూ అద్భుతమైన స్మాష్‌లు, డ్రాప్ షాట్లతో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. దీంతో తొలి గేమ్‌ను 21-16తో కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లో పీవీ సింధు మరింతగా విజృంభించింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ గేమ్‌లో ప్రారంభంలోనే 8-0తో భారీ ఆధిక్యం సాధించి.. చివరకు 21-14తో మ్యాచ్‌ను చాలా ఈజీగా ముగించింది. ఈ అద్భుత విజయంతో హాన్ యూపై పీవీ సింధు తన ముఖాముఖి (Head-to-Head) రికార్డును 8-1కి మెరుగుపరుచుకుంది.

క్వార్టర్స్‌లో ఒకుహారాతో తలపడనుంది

ఈ గెలుపుతో మంచి ఊపుమీదున్న 31 ఏళ్ల పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్ క్రీడాకారిణి, తన చిరకాల ప్రత్యర్థి నొజోమీ ఒకుహారాతో తలపడనుంది. నిజానికి రెండో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ అయిన దక్షిణ కొరియా స్టార్ ప్లేయర్ ఆన్ సే-యంగ్ గాయం కారణంగా వైదొలగడంతో ఒకుహారాకు వాకోవర్ లభించింది. దాంతో ఆమె శ్రమ లేకుండా నేరుగా క్వార్టర్స్ చేరింది. పీవీ సింధు, ఒకుహారాల మధ్య గతంలో అనేక ఉత్కంఠభరితమైన పోరాటాలు (ముఖ్యంగా 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్) జరిగాయి. కాబట్టి ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా అత్యంత ఆసక్తికరంగా మారనుంది.

టోర్నీలో మిగిలిన ఏకైక భారత క్రీడాకారిణి

ప్రస్తుతం జపాన్ ఓపెన్ టోర్నమెంట్‌లో భారత్ తరపున పీవీ సింధు ఒక్కతే ఏకైక ఛాలెంజర్‌గా నిలిచింది. అంతకుముందు జరిగిన ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌లో తనిషా క్రాస్టో, ధ్రువ్ కపిల మిక్స్‌డ్ డబుల్స్ జోడీ పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాంతో ఇప్పుడు టోర్నమెంట్‌లో సింధు ఒక్కతే మిగిలిన భారత క్రీడాకారిణిగా నిలిచింది. తనిషా, ధ్రువ్‌ల భారత జోడీ, టాప్ సీడెడ్ చైనా జోడీ అయిన ఫెంగ్ యాన్ జె, హువాంగ్ డాంగ్ పింగ్‌ల చేతిలో 47 నిమిషాల పాటు పోరాడి 20-22, 17-21 తేడాతో ఓడిపోయింది. డబుల్స్ నిరాశ పరిచినప్పటికీ, సింగిల్స్‌లో పీవీ సింధు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com