క్వెట్టాలో దాడి చేసింది తామేనంటున్న ఐఎస్ఐఎస్
- August 13, 2016
పాకిస్థాన్‌లోని క్వెట్టాలో బాంబు దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ మేరకు దాడికి బాధ్యత వహిస్తూ.. ట్విట్టర్లో పోస్టు చేసింది. అయితే ఐఎస్ ప్రకటనను పాక్ భద్రతా సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు. పాక్‌లో ప్రాబల్యం పెంచుకునేందుకే ఇస్లామిక్ స్టేట్ ఇలాంటి ప్రకటనలు చేస్తోందని పోలీసులు ఆరోపిస్తున్నారు.
పాకిస్థాన్ తాలిబన్, అల్‌ఖైదా మూలాలు ఎక్కువగా ఉన్న పాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉనికి తక్కువ. దీంతో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ఐఎస్ ఇలాంటి ప్రకటనలు చేస్తోంది. ఇటీవల క్వెట్టాలోని ప్రభుత్వాస్పత్రిలో జరిగిన దాడికి సైతం తమదే బాధ్యతంటూ ఐఎస్ ప్రకటించుకుంది. అయితే దీనికి ముందే దాడి చేసింది తామేనంటూ పాకిస్థానీ తాలిబన్ వెల్లడించింది.
లాయర్లను లక్ష్యంగా చేసుకుని గత సోమవారం పాక్‌లోని క్వెట్టాలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 73 మంది మృతిచెందగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. ఇది జరిగిన రెండు రోజులకే క్వెట్టాలోని మరో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మందికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







