అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- July 18, 2026
*రియాద్: జోర్డాన్ రాజధాని అమ్మాన్ మరియు యెమెన్ రాజధాని సనా మధ్య సాధారణ వాణిజ్య విమాన సర్వీసులను ప్రారంభించాలన్న జోర్డాన్ చొరవను సౌదీ అరేబియా స్వాగతించింది. ఈ చర్య యెమెన్ ప్రజల అవసరాలను తీర్చడంతో పాటు పౌరుల ప్రయాణాలను సులభతరం చేసే మానవతా కార్యక్రమమని సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రతిపాదనకు యెమెన్ ప్రభుత్వం ఆమోదం తెలపడం అభినందనీయమని పేర్కొంది. యెమెన్ పౌరులకు ఉపయోగపడే విధంగా ప్రక్రియలను సులభతరం చేయడం, మానవతా సంక్షోభాన్ని తగ్గించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఈ నిర్ణయం సూచిస్తోందని తెలిపింది.
అలాగే, ఈ చొరవకు హౌతీ తిరుగుబాటుదారులు సానుకూలంగా స్పందించాలని, గతంలో ప్రజల ఇబ్బందులను మరింత పెంచిన చర్యలను పునరావృతం చేయవద్దని సౌదీ పిలుపునిచ్చింది. యెమెన్లో మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసే ఉద్రిక్త చర్యలకు దూరంగా ఉండాలని కోరింది. యెమెన్ భద్రత, స్థిరత్వానికి దోహదపడే ప్రతి శాంతి ప్రయత్నానికి తాము మద్దతు కొనసాగిస్తామని, దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షిస్తూ యెమెన్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని సౌదీ పునరుద్ఘాటించింది.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వం కూడా జోర్డాన్ చొరవను స్వాగతిస్తూ, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించింది. జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం.. అవసరమైన సాంకేతిక, లాజిస్టిక్ ఏర్పాట్లు పూర్తయిన అనంతరం రాయల్ జోర్డానియన్ ఎయిర్లైన్స్ అమ్మాన్–సనా మధ్య వాణిజ్య విమాన సర్వీసులను ప్రారంభించనుంది.
ఈ చొరవ యెమెన్ శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు సౌదీ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా ఉండటంతో పాటు, జోర్డాన్–యెమెన్ మధ్య వాణిజ్య విమాన సర్వీసుల పునరుద్ధరణపై గతంలో కుదిరిన అవగాహనలను అమలు చేయడంలో కీలక అడుగుగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







