షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!

- July 18, 2026 , by Maagulf
షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!

మనామా: బహ్రెయిన్‌లోని షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్ ‌లో బు కువా (Bu Quwah) సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పాదచారి మృతి చెందాడు.

అధికారుల వివరాల ప్రకారం, రహదారిపై వెళ్తున్న వ్యక్తిని ఓ వాహనం ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాదచారి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com