విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!

- July 21, 2026 , by Maagulf
విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!

అమెరికా: అమెరికాలో చదువుకుంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులతో పాటు అంతర్జాతీయ విద్యార్థులకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ (D/S) విధానాన్ని రద్దు చేస్తూ, విద్యార్థుల బసపై గరిష్ఠంగా నాలుగేళ్ల నిర్దిష్ట కాలపరిమితి (Fixed Period of Admission) విధించింది. కొత్త నిబంధనల ప్రకారం కోర్సు కాలపరిమితి లేదా గరిష్ఠంగా 4 సంవత్సరాల వరకు మాత్రమే యుఎస్‌లో ఉండేందుకు అనుమతి లభిస్తుంది. ఒకవేళ పిహెచ్‌డీ లేదా సుదీర్ఘమైన కోర్సులు చేసేవారు నాలుగేళ్ల కంటే ఎక్కువ కాలం ఉండాల్సి వస్తే, యూఎస్‌సిఐఎస్ (USCIS)కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకుని గడువు పెంపు (Extension of Stay) పొంది, అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

సెప్టెంబర్ 15 డెడ్‌లైన్: పాత విద్యార్థులకు ఊరట
ఈ కొత్త మార్గదర్శకాలు సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆలోపు ఇప్పటికే అమెరికాలో ఉండి విద్యాభ్యాసం కొనసాగిస్తున్న విద్యార్థులకు మినహాయింపునిచ్చారు; వారు పాత ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ నిబంధనల పరిధిలోనే కొనసాగుతారు. అయితే, సెప్టెంబర్ 15 తర్వాత యుఎస్‌లో అడుగుపెట్టే కొత్త విద్యార్థులకు మాత్రం ఈ నాలుగేళ్ల పరిమితి నిబంధన వర్తిస్తుంది. అంతేకాకుండా, కోర్సు పూర్తయిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు లేదా ఇతర కేటగిరీకి మారేందుకు ఇచ్చే గ్రేస్ పీరియడ్‌ను కూడా 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com