భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- July 21, 2026
న్యూఢిల్లీ: భారత్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కొత్త రాయబారిగా నియమితులైన అబ్దుల్లా అల్ నుఐమీ తన క్రెడెన్షియల్స్ డాక్యుమెంట్స్ ను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆ శాఖ తాత్కాలిక చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అల్ నుఐమీకి శుభాకాంక్షలు తెలిపారు. భారత్–యూఏఈ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఆయన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రెండు దేశాల మధ్య సంబంధాల అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.
అనంతరం అబ్దుల్లా అల్ నుఐమీ మాట్లాడుతూ.. భారత్‌లో యూఏఈకి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. అంతకుముందు, భారత్–యూఏఈ మధ్య సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలపై ఇరు పక్షాలు చర్చించాయి. రెండు దేశాల ప్రజల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్‌లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!







