కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- July 21, 2026
కువైట్ సిటీ: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-4 (T4) వద్ద 8.5 కిలోలకుపైగా హషీష్‌ను అక్రమంగా దేశంలోకి తరలించే ప్రయత్నాన్ని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇథియోపియాలోని అడిస్ అబాబా నుంచి వచ్చిన బెనిన్‌కు చెందిన ఓ ప్రయాణికుడి లగేజీపై అనుమానం రావడంతో అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో రెండు సూట్‌కేసుల్లో మొత్తం 8.547 కిలోల హషీష్ దాచినట్లు గుర్తించారు. ఒక సూట్‌కేసులో 3.732 కిలోలు, మరో సూట్‌కేసులో 4.815 కిలోల హషీష్‌ను స్వాధీనం చేసుకున్నారు. సూట్‌కేసుల అడుగు భాగంలో ప్రత్యేకంగా రహస్య అరలను తయారు చేసి, టిన్ ఫాయిల్‌లో చుట్టి మాదకద్రవ్యాలను దాచినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ తనిఖీలను కస్టమ్స్ పోర్ట్స్ అఫైర్స్, కస్టమ్స్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ విభాగం డిప్యూటీ హెడ్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఘటన అనంతరం అధికారిక కేసు నమోదు చేసి, నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను తదుపరి విచారణ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ డ్రగ్ అండ్ ఆల్కహాల్ కంట్రోల్కు అప్పగించారు. కువైట్ లోకి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అన్ని ప్రవేశ ద్వారాల వద్ద తనిఖీలను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అక్రమ రవాణా ప్రయత్నాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిబ్బంది సామర్థ్యంతో పాటు సాంకేతిక వనరులను కూడా నిరంతరం బలోపేతం చేస్తున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్‌లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం







