బిగ్ బాస్ ఆరు భాషల ఎడిషన్లతో జియోస్టార్ ధమాకా

- July 22, 2026 , by Maagulf
బిగ్ బాస్ ఆరు భాషల ఎడిషన్లతో జియోస్టార్ ధమాకా

రాబోయే పండుగ సీజన్‌ను మరింత వేడుకగా మార్చేందుకు జియోస్టార్ (JioStar) సంస్థ దేశంలోనే అతిపెద్ద రియాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 2026 నుండి హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు బంగ్లా భాషలలో ఏకకాలంలో ఆరు బిగ్ బాస్ ఎడిషన్లను ప్రసారం చేయడానికి సిద్ధమైంది. జియోస్టార్ టెలివిజన్ నెట్‌వర్క్‌తో పాటు జియోహాట్‌స్టార్‌లో ఇవి ప్రసారం కానున్నాయి. ప్రసిద్ధ హోస్ట్‌లు సల్మాన్ ఖాన్, నాగార్జున, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, మోహన్‌లాల్‌లతో పాటు ఈసారి బెంగాల్ గర్వకారణం సౌరవ్ గంగూలీ కూడా ఈ ఫ్రాంచైజీలో చేరుతుండటం విశేషం. ఈ అపూర్వ మైలురాయిని పురస్కరించుకుని, బిగ్ బాస్ సాధించిన సాంస్కృతిక ప్రయాణం మరియు బ్రాండ్ విజయాన్ని ప్రతిబింబించేలా ‘ఇండియాస్ బిగ్ రియాలిటీ’ (India’s Big Reality) అనే ప్రత్యేక కాఫీ టేబుల్ పుస్తకాన్ని సంస్థ ఆవిష్కరించింది.

కోట్లాది వీక్షకాదరణ & బ్రాండ్‌లకు వేదిక: బిగ్ బాస్ రికార్డుల ప్రభంజనం!
బిగ్ బాస్ షో కేవలం వినోదానికే పరిమితం కాకుండా, దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్‌గా నిలిచిందని ‘ఇండియాస్ బిగ్ రియాలిటీ’ నివేదిక వెల్లడించింది. 2025 సీజన్‌లో అన్ని భాషల్లో కలిపి 500 మిలియన్లకు పైగా రీచ్, 438 బిలియన్ల వీక్షణ నిమిషాలను నమోదు చేసి, వార్షిక ప్రాతిపదికన 47% ఎంగేజ్‌మెంట్ వృద్ధిని సాధించింది. దాదాపు 625 కంటే ఎక్కువ ప్రముఖ బ్రాండ్‌లు తమ ఉత్పత్తుల ప్రచారానికి ఈ వేదికను వినియోగించుకున్నాయి. జియోహాట్‌స్టార్‌లో 24×7 లైవ్ ఫీడ్స్, 9.32 బిలియన్ల ఓట్లు, మరియు 1.7 బిలియన్లకు పైగా సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్లతో బిగ్ బాస్ భారతదేశపు అత్యంత ఇంటరాక్టివ్ వినోద వ్యవస్థగా నిలిచింది. పండుగ వేళ కంటెంట్, సంస్కృతి, వాణిజ్యాలు సంగమించే ఈ వేదిక వ్యాపార దిగ్గజాలకు సరికొత్త దిశానిర్దేశం చేస్తోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com