ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- July 23, 2026
మనామా: బహ్రెయిన్‌లోని ఓ ఆసుపత్రిలో మహిళా రోగి మృతి చెందిన ఘటనపై నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (NHRA) దర్యాప్తు ప్రారంభించింది. ఘటనపై సమాచారం అందిన వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసును పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన NHRA.. రోగి వైద్య రికార్డులు, ఆమెకు అందించిన చికిత్స, మరణానికి ముందు చేపట్టిన వైద్య విధానాలను సమగ్రంగా పరిశీలిస్తోంది. అలాగే, ఈ ఘటనకు సంబంధించిన వైద్య సిబ్బంది, ఇతర సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయనుంది.
వైద్య సేవలు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, క్లినికల్ ప్రోటోకాల్స్, వృత్తిపరమైన ప్రమాణాలకు అనుగుణంగా అందించబడాయా లేదా అనే అంశాన్ని కమిటీ పరిశీలించనుంది. దర్యాప్తు పూర్తిగా స్వతంత్రంగా, నిష్పాక్షికంగా నిర్వహిస్తామని, వాస్తవాలను వెలికితీయడంతో పాటు అన్ని పక్షాల హక్కులను పరిరక్షిస్తామని NHRA తెలిపింది. విచారణలో ఎలాంటి నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే, సంబంధిత వారిపై చట్టపరమైన లేదా నియంత్రణపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
విచారణ పూర్తయిన అనంతరం నివేదికను ప్రజలకు వెల్లడిస్తామని పేర్కొన్న NHRA, అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని, ధృవీకరించని వార్తలను ప్రచారం చేయవద్దని, దర్యాప్తు ముగిసే వరకు ఎలాంటి నిర్ణయాలకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా, మృతురాలి కుటుంబ సభ్యులకు NHRA ప్రగాఢ సానుభూతిని తెలిపింది.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







