యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- July 23, 2026
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) తన వినియోగదారుల కోసం ట్యాబీ (Tabby) ఈఎంఐ చెల్లింపు సేవను ప్రారంభించింది. దీంతో మంత్రిత్వ శాఖకు చెల్లించాల్సిన ఫీజులు, పరిపాలనా జరిమానాలను 4 నుంచి 12 నెలల వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించింది.
ప్రతి లావాదేవీకి గరిష్టంగా 20,000 దిర్హామ్‌ల వరకు ట్యాబీ ద్వారా ఈఎంఐ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఈ సేవతో వినియోగదారులు తమ ఆర్థిక బాధ్యతలను సులభంగా, డిజిటల్ విధానంలో తీర్చుకునే అవకాశం లభిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
MoHRE సహాయ అండర్ సెక్రటరీ మొహమ్మద్ సకర్ అల్ నుయైమీ మాట్లాడుతూ.. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజిటల్ సేవలను మరింత మెరుగుపరచడం, ప్రభుత్వ సేవలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ కొత్త సేవను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
ఇప్పటికే అమల్లో ఉన్న క్రెడిట్ కార్డు ఈఎంఐ సౌకర్యం కూడా కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎమిరేట్స్ ఎన్బీడీ (Emirates NBD), అబుదాబి కమర్షియల్ బ్యాంక్ (ADCB), అబుదాబి ఇస్లామిక్ బ్యాంక్ (ADIB), ఫస్ట్ అబుదాబి బ్యాంక్ (FAB), మష్రెక్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్ (CBD), కమర్షియల్ ఇంటర్నేషనల్ బ్యాంక్ (CIB), రాక్బ్యాంక్ (RAKBANK) జారీ చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా కూడా ఫీజులు, జరిమానాలను గరిష్టంగా 12 నెలల వరకు వడ్డీ లేకుండా ఈఎంఐల్లో చెల్లించవచ్చు. అయితే, ఈ సౌకర్యం ఆయా బ్యాంకుల నిబంధనలు, క్రెడిట్ కార్డు పరిమితులకు లోబడి ఉంటుందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్..మంత్రి గొట్టిపాటి ప్రకటన
- మద్రాస్ రెజిమెంట్‌లో చోరీపై సీవీ ఆనంద్ సంచలన వివరాలు
- 18 మంది ఆసియా వాసులను అక్రమంగా తరలించే ప్రయత్నం భగ్నం
- ఖైరతాబాద్ వినాయకుడి తొలి పూజకు రావాలని గవర్నర్‌కు ఉత్సవ కమిటీ ఆహ్వానం
- పుతిన్‌కు ప్రధాని మోదీ అరుదైన కానుక!
- ట్రాన్స్జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్
- కువైట్‌లో భారీగా కల్తీ, నాణ్యత లేని ఆహారం ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో విద్వేష ప్రసంగాలకు కఠిన శిక్షలు..!!
- పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శివప్రతాప్
- వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్!







