యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!

- July 23, 2026 , by Maagulf
యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) తన వినియోగదారుల కోసం ట్యాబీ (Tabby) ఈఎంఐ చెల్లింపు సేవను ప్రారంభించింది. దీంతో మంత్రిత్వ శాఖకు చెల్లించాల్సిన ఫీజులు, పరిపాలనా జరిమానాలను 4 నుంచి 12 నెలల వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించింది.

ప్రతి లావాదేవీకి గరిష్టంగా 20,000 దిర్హామ్‌ల వరకు ట్యాబీ ద్వారా ఈఎంఐ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఈ సేవతో వినియోగదారులు తమ ఆర్థిక బాధ్యతలను సులభంగా, డిజిటల్ విధానంలో తీర్చుకునే అవకాశం లభిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

MoHRE సహాయ అండర్ సెక్రటరీ మొహమ్మద్ సకర్ అల్ నుయైమీ మాట్లాడుతూ.. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజిటల్ సేవలను మరింత మెరుగుపరచడం, ప్రభుత్వ సేవలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ కొత్త సేవను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.

ఇప్పటికే అమల్లో ఉన్న క్రెడిట్ కార్డు ఈఎంఐ సౌకర్యం కూడా కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎమిరేట్స్ ఎన్‌బీడీ (Emirates NBD), అబుదాబి కమర్షియల్ బ్యాంక్ (ADCB), అబుదాబి ఇస్లామిక్ బ్యాంక్ (ADIB), ఫస్ట్ అబుదాబి బ్యాంక్ (FAB), మష్రెక్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్ (CBD), కమర్షియల్ ఇంటర్నేషనల్ బ్యాంక్ (CIB), రాక్‌బ్యాంక్ (RAKBANK) జారీ చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా కూడా ఫీజులు, జరిమానాలను గరిష్టంగా 12 నెలల వరకు వడ్డీ లేకుండా ఈఎంఐల్లో చెల్లించవచ్చు. అయితే, ఈ సౌకర్యం ఆయా బ్యాంకుల నిబంధనలు, క్రెడిట్ కార్డు పరిమితులకు లోబడి ఉంటుందని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com