ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- July 23, 2026
దోహా: ఖతార్‌లో మూడు సంవత్సరాల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసిన భారత రాయబారి హెచ్.ఇ. విపుల్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా భారత-ఖతార్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని, ఖతార్ నాయకత్వం మరియు భారతీయ ప్రవాసుల సహకారం తన పదవీకాలాన్ని విజయవంతం చేసిందని రాయబారి విపుల్ పేర్కొన్నారు.
రాయబారి విపుల్‌ను ప్రజల రాయబారి (People's Ambassador)గా అభివర్ణిస్తూ, ఆయన అందుబాటులో ఉండే తీరు, ప్రజల సమస్యల పట్ల చూపిన చొరవ, సేవాభావం కారణంగా ప్రవాస భారతీయుల గౌరవాన్ని, అభిమానాన్ని పొందారని ఇండియన్ కమ్యూనిటీ నాయకులు కొనియాడారు.
ఈ వీడ్కోలు కార్యక్రమాన్ని ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC), ఇండియన్ కమ్యూనిటీ బెనెవోలెంట్ ఫోరం (ICBF), ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్ (ISC), ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్స్ కౌన్సిల్ (IBPC) సంయుక్తంగా ఐసీసీ అశోకా హాల్‌లో నిర్వహించాయి.
ఖతార్‌లో 8.3 లక్షలకు పైగా ఉన్న ఇండియన్ కమ్యూనిటీ ప్రపంచంలోనే అత్యంత క్రమబద్ధంగా పనిచేసే ప్రవాస సమాజాల్లో ఒకటిగా నిలిచిందని విపుల్ ప్రశంసించారు. భారత రాయబార కార్యాలయంతో కలిసి ఐసీసీ, ఐసీబీఎఫ్, ఐఎస్సీ, ఐబీపీసీ సంస్థలు భారతీయుల సంక్షేమం కోసం విశేషంగా పనిచేశాయని పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాల్లో సంస్కృతి, క్రీడలు, వ్యాపారం, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో ఈ సంస్థలు కీలక పాత్ర పోషించాయని రాయబారి విపుల్ తెలిపారు.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్ లో బోటు ప్రమాదం..76కు చేరిన మరణాలు
- న్యూఢిల్లీలో పుతిన్‌తో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- BRICS సమ్మిట్..నేటి షెడ్యూల్ ఇదే
- తెలంగాణ అసెంబ్లీ సెషన్: ప్రజా విశ్వాసం బిల్లు-2026 ఆమోదం
- తమిళ సినీ అభిమానులకు సర్ప్రైజ్.. సిల్వర్‌స్టోన్‌లో విజయ్, అజిత్ కుమార్ కలయిక
- SIIMA 2026 తెలుగు,కన్నడ విజేతలు వీరే..
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- యూఏఈ లాటరీలో Dh100,000 బహుమతి గెలిచిన వ్యక్తి..!!
- బహ్రెయిన్‌లో BD14,000 విలువైన చోరీలు.. ఐదుగురు అరెస్ట్..!!
- సౌదీలో భారీగా అక్రమ నివాసితుల అరెస్టులు..!!







